శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జూన్ 26: అమ్మఒడి పథకం మూడోవిడతను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయల్దేరి 8.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9 గంటలకు అక్కడ విమానం ఎక్కి 9.45 గంటలకు విశాఖప ట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ 9.55 గంటలకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 10.30 గంటలకు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆర్‌అండ్‌బీ హెలీప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ 10.45 గంటలవరకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తరువాత రోడ్డుమార్గంలో బయల్దేరి 10.55 గంటలకు కోడి రామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకుంటారు. 10.55 నుంచి 11.15 గంటల వరకు ప్రజాప్రతినిధులు ప్రసంగిస్తారు. 11.15 గంటల నుంచి 11.25 గంటల వరకు ఇద్దరు అమ్మఒడి లబ్ధిదారులతో మాట్లాడిస్తారు. ఆ తర్వాత 11.25 గంటల నుంచి 12.10 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. 12.15 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి మూడోవిడత పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 12.25 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 12.30 గంటలకు హెలీకాప్టర్‌లో బయల్దేరి 1.05 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 1.15 గంటలకు విమానంలో బయల్దేరి 2 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.10 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి 2.30 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసానికి చేరుకుంటారు.
1500 మందితో బందోబస్తు
అరసవల్లి: శ్రీకాకుళం నగరంలో సోమవారం జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన కోసం 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, హోమ్‌గార్డులతో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీఆర్ రాధిక తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియంలో పోలీసు అధికారు లు, సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. పోలీసులు తమకు కేటాయించిన విధులకు సమయానికి హాజరవ్వాలని చెప్పా రు. ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు సవ్యంగా జరిగేలా చూడాలన్నారు. వీఐపీ కాన్వాయ్ వచ్చే సమయంలో అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మీటింగ్ గ్రౌండ్ చుట్టూ ఉండే రూఫ్ టాప్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులను గుర్తించినట్లయితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. గేలరీలో, పార్కింగ్ ప్రదేశాల్లో పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.