ముఖ్యమంత్రి గారూ.. మద్యం నిషేధించి మాట నిలబెట్టుకోండి

ABN , First Publish Date - 2022-01-28T05:02:15+05:30 IST

ముఖ్యమంత్రి గారూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మరకు మద్యం నిషేదించి మాట నిలబెట్టుకోవాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నజీర్‌అహమ్మద్‌ అన్నారు.

ముఖ్యమంత్రి గారూ.. మద్యం నిషేధించి మాట నిలబెట్టుకోండి
మాట్లాడుతున్న రాజంపేట పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నజీర్‌ అహమ్మద్‌

రాజంపేట పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నజీర్‌అహమ్మద్‌


రాయచోటిటౌన్‌, జనవరి 27: ముఖ్యమంత్రి గారూ... ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మరకు మద్యం నిషేదించి మాట నిలబెట్టుకోవాలని రాజంపేట పార్లమెంటరీ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి నజీర్‌అహమ్మద్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటి పట్టణంలోని ఎన్జీవో హోంలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, రాష్ట్ర ప్రజలకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగులు చేపడుతున్న ఉద్యమాన్ని దారి మళ్లించేందుకు తీసుకొచ్చి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి అల్లాబకష్‌, డీసీసీ మైనార్టీ ఉపాధ్యక్షుడు ఆడిటర్‌ మన్సూర్‌అలీఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-28T05:02:15+05:30 IST