Chief Minister: నిర్మాణాలను త్వరగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2022-09-30T13:14:16+05:30 IST

నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)

Chief Minister: నిర్మాణాలను త్వరగా పూర్తిచేయండి

                                  - ఆదేశించిన సీఎం స్టాలిన్‌


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 29: నగర శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదేశించారు. వర్షపునీటి కాల్వలు, వరద నివారణ పనులను గురువారం సీఎం పరిశీలించారు. సెమ్మంజేరి టీఎ్‌సఎఫ్‌ వెనుకవైపు, పెరుంబాక్కం సమీపంలోని వంతెన, నేతాజీ నగర్‌ ప్రధాన రహదారి, వేళచ్చేరి - తాంబరం(Velachery - Tambaram) రహదారికి సమీపంలో బాలాజీ నగర్‌ దంత వైద్య కాలేజీ వద్ద జరుగుతున్న వర్షపునీటి కాల్వల నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, పళ్ళిక్కరణి, తామరైకులం ప్రాంతం, వేళచ్చేరి ఏజీఎస్‌ కాలనీ, అడయారు కస్తూర్బా మూడో ప్రధాన రహదారి, ఇందిరా నగర్‌ మూడో ప్రధాన రహదారి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో రూ.174.48 కోట్లతో సాగుతున్న ఈ పనులపై సీఎం స్టాలిన్‌ గురువారం సంబంధింత శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, టీఎం అన్బరసన్‌, పొన్ముడి, ఎం.సుబ్రమణ్యం, ఉన్నతాధికారులు సందీప్‌ సక్సేనా, కలెక్టర్‌ రకుల్‌నాథ్‌లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T13:14:16+05:30 IST