మైనార్టీల ద్రోహి ముఖ్యమంత్రి జగన

ABN , First Publish Date - 2022-06-30T05:41:47+05:30 IST

పేద మైనార్టీలకు ఎంతో ఉపయోగపడే దుల్హన, విదేశీ విద్య పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మైనార్టీల ద్రోహి అని టీడీపీ కదిరి ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

మైనార్టీల ద్రోహి ముఖ్యమంత్రి జగన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట

దుల్హన రద్దుకు నిరసనగా వచ్చే నెల 5న ధర్నా

మైనార్టీ పక్షపాతికి దుల్హన గుర్తుకు రాలేదా? 

రెవెన్యూ, పోలీసు ఆధికారులు

 ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి 

:  మాజీ ఎమ్మెల్యే కందికుంట

కదిరి, జూన 29: పేద మైనార్టీలకు ఎంతో ఉపయోగపడే దుల్హన, విదేశీ విద్య పథకాలు రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మైనార్టీల ద్రోహి అని టీడీపీ కదిరి ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం దుల్హన పథకానికి నిధులు కేటాయించలేక రద్దు చేయడాన్ని నిరసిస్తూ జూలై 5వ తేదీన టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముస్లింలకు అండగా ఉంటానంటూ మాయమాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన ముఖ్య మంత్రి జగన్మోహనరెడ్డి.... పేద ప్రజలకు అండగా ఉంటున్న దుల్హన పథకానికి నిధులు కేటాయించలేమని సాక్షాత్తు హైకోర్టులోనే చెప్పడం సిగ్గుచేటన్నారు. మైనార్టీల పథకాలైన దుల్హన, రంజానతోఫా, మసీదుల పుర్‌నిర్మాణానికి ఆర్థికసాయం, విదేశీ విద్య, ఇలా ఎన్నో  రద్దు చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ వారంలో రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రికి ఇంకెన్నివారాలు కావాలని ప్రశ్నించారు. వెంటనే దుల్హన పథకాన్ని అమలు చేయకపోతే కదిరిలో ప్రారంభమయ్యే ఆందోళన రాష్ట్ర వ్యాప్తమవుతుందని హెచ్చరించారు. ముస్లిం మైనార్టీల కోసం చేస్తున్న ఈ ఆందోళనకు నియోజకవర్గంలోని మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తరలి రావాలన్నారు. 

మైనార్టీ పక్షపాతికి ప్లీనరీలో గుర్తుకు రాలేదా: మదరసా, మసీదుల్లో తాను మైనార్టీ పక్షపాతినని చెప్పే స్థానిక ప్రజాప్రతినిధి... దుల్హన పథకాన్ని పునరుద్ధరించాలని ప్లీనరీలో ఎందుకు తీర్మానం చేయలేదని కందికుంట ప్రశ్నించారు. మాటల్లోనే మైనార్టీ పక్షపాతిగా ఉండకూడదని చేతల్లోనూ వారికి సాయం చేయాలని హితవు పలికారు.

ప్రభుత్వ ఆస్తులను కాపాడండి: పట్టణంలో ప్రభుత్వ ఆస్తులను అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా కబ్జా చేస్తున్నారని, వాటిని కాపాడాల్సిన బాధ్యత రెజఠన్యూ, పోలీస్‌ అధికారులపై ఉందన్నారు. అడపాల వీధిలో అత్యంత విలువైన స్థలం సర్వే 206లో ఉంటే దాన్ని కబ్జాచేయడానికి అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దానికి కంచె వేయాలని పదే పదే తాను చెబుతున్నా, అధికారులు పట్టించుకోలేదన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వైసీపీ నాయకులు కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌కు చెప్పిన ప్రయోజనం లేకపోయిందన్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోక పోతే తాము రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. ఈసమావేశంలో తెలుగుయువత జిల్లా అధ్యక్షులు బాబ్‌జాన మాట్లాడుతూ మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముచిందన్నారు. ఈసమావేశంలో నాయకులు బాబు తదితరులున్నారు. 


Updated Date - 2022-06-30T05:41:47+05:30 IST