తిరుమల: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా సీజేఐ అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి(Dharma reddy) స్వాగతం పలికారు.
మరోవైపు... తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) శ్రీవారిని 70,019 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 36,124 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.52 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇవి కూడా చదవండి