Advertisement
Advertisement
Abn logo
Advertisement

గోలిచినా కోడి వింగ్స్‌

కావాల్సిన పదార్థాలు: నానబెట్టి, ఫ్రై చేసేందుకు...

చికెన్‌ వింగ్స్‌ -240గ్రాములు, కార్న్‌ ఫ్లోర్‌ - 10 గ్రాములు, గుడ్డు- ఒకటి, కారం - 5గ్రా, ధనియాల పొడి - 5గ్రా, జీలకర్ర పొడి-  5 గ్రాములు, అల్లం వెల్లుల్లి, పేస్ట్‌ - 10 గ్రాములు, నీరు - తగినంత, రిఫైండ్‌ ఆయిల్‌ - పావు లీటరు 


గోలిచినా కోడి వింగ్స్‌ తయారీ కోసం: రిఫైండ్‌ ఆయిల్‌ - తగినంత, కరివేపాకు - 2గ్రాములు, వెల్లుల్లి - 5 గ్రాములు, ఉల్లిపాయలు - 10గ్రా, కారం పొడి - 5 గ్రాములు, జీలకర్ర పొడి - 5 గ్రాములు, శనగపిండి - 15 గ్రాములు


తయారీ విధానం: పైన పేర్కొనబడిన పదార్దాలను ఓ గిన్నెలో తీసుకుని చికెన్‌ ను కూడా కలిపి ఓ గంట నానబెట్టాలి. ఇప్పుడు ఓ నాన్‌ స్టిక్‌ పాన్‌లో  నూనె వేసి వేడి చేయాలి. ఈ చికెన్‌ను బంగారు వర్ణం వచ్చే వరకూ బాగా వేయించాలి. 


ఇప్పుడు మరో నాన్‌ స్టిక్‌ పాన్‌ తీసుకుని కొద్దిగా నూనె వేసి, దానిలో వెల్లుల్లి జోడించి బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయలు జోడించి వేయించిన తరువాత మసాలా పొడులు కలపాలి. ఇప్పుడు ముందుగా వేయించిన చికెన్‌ కలిపి ఆ ముక్కలకుమసాలా బాగా పట్టే వరకూ తిప్పాలి. చివరలో శెనగపిండి కూడా జోడించి,  చికెన్‌ ముక్కలకు ఈ పొడి పట్టేంత వరకూ తిప్పాలి. వేడిగా ఉన్నప్పుడే వేయించిన కరివేపాకు జోడించి కొబ్బరి తురుము కూడా జోడిస్తే ఇంకాస్త రుచిగా ఉంటుంది.

దమ్‌ కీ నల్లీఅన్నానేటివ్‌ కోడి కారమ్‌ చిప్స్‌భునా యాతా నల్లీ బిర్యానీపాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌టిక్కామంచూరియా
Advertisement