పడి లేచిన కోడి!

ABN , First Publish Date - 2020-03-31T09:25:29+05:30 IST

మొన్నటి వరకూ బతికున్న కోడి రూ.10-20కి కూడా కొనేవారు లేక కోళ్ల కంపెనీలు, పౌల్ట్రీ రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ పుణ్యమాని పరిస్థితి తారుమారైంది. అందరూ ఇళ్లల్లోనే ఉండడంతో

పడి లేచిన కోడి!

అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకూ బతికున్న కోడి రూ.10-20కి కూడా కొనేవారు లేక కోళ్ల కంపెనీలు, పౌల్ట్రీ రైతులు నష్టాల్లో కొట్టుమిట్టాడారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ పుణ్యమాని పరిస్థితి తారుమారైంది. అందరూ ఇళ్లల్లోనే ఉండడంతో వినియోగం ఎక్కువై చికెన్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో కేజీ చికెన్‌ ధర పుంజుకుని రయ్‌మంటూ రూ.170-200 మార్కుని తాకింది. ఇన్నాళ్లూ నష్టాల్లో కొట్టుమిట్టాడిన కోడి రైతు, కంపెనీలు కొత్త బ్యాచ్‌ను పెంచడం ఆపేశాయి. ఇప్పుడు ఉన్నట్టుండి పెరగడంతో డిమాండ్‌కు సరిపడా స్టాకు లేకపోవడం కూడా ధరలు ఎగబాకడానికి కారణమైంది. కరోనా కారణంగా మొన్నటివరకు కిలో కోడి రూ.20లోపే పలకడంతో రైతుకు పెంపకం ఖర్చులు కూడా రాలేదు. దీంతో కోళ్లను మేపలేక వదిలేశారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు.  ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో అసలు కోళ్లే లేకుండా పోయాయి. ు లాక్‌డౌన్‌ నేపథ్యంలో మాంసాహార ప్రియులు మళ్లీ చికెన్‌పై పడ్డారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కోళ్ల ఫారాల్లో స్టాకు అంతంతమాత్రమే ఉంది. మళ్లీ కోళ్ల కంపెనీలు కోడి పిల్లల్ని సరఫరా చేసి.. వాటిని పెంచాలంటే కనీసం 45రోజులు పడుతుంది. అప్పటి వరకూ ప్రస్తుతం ఉన్న స్టాకు సరిపోకపోతే కోడి మాంసం రేటు మరింత పెరిగే అకాశాలున్నాయి.

Updated Date - 2020-03-31T09:25:29+05:30 IST