Advertisement
Advertisement
Abn logo
Advertisement

చికెన్‌ మసాలా కర్రీ

కావలసినవి: చికెన్‌ - అరకేజీ, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - మూడు, అల్లంవెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌, వెనిగర్‌ - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్ర పొడి - రెండు టీస్పూన్లు, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - పావుకేజీ, సిమ్లామిర్చి పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర - కొద్దిగా. 


తయారీ: చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన ఉల్లిపాయలు వేసి కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టాలి. తరువాత మరొక పాత్రలో పెరుగు తీసుకుని అందులో పచ్చిమిర్చి, వెనిగర్‌, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరంమసాలా, సిమ్లా మిర్చి పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలపై పోయాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక చికెన్‌ వేసి వేగించాలి. మసాలా ముక్కలకు బాగా పట్టుకునే వరకు వేగించుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.


దమ్‌ కీ నల్లీపాలకూర చికెన్‌ కర్రీకరివేపాకు చికెన్‌ అల్లం చికెన్‌ బ్యాంబూ షూట్స్‌ చికెన్‌ గోంగూర చికెన్‌నర్గీసి కబాబ్‌ కా కుర్మాకోఫ్తా ఔర్‌ దహీ కి కాడీకాలియా ఖాసా దో - ప్యాజ్‌క్విక్‌ చికెన్‌!
Advertisement