కావలసినవి: చికెన్ - అరకిలో, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - నాలుగు రెబ్బలు, పచ్చిమిర్చి - రెండు, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్, పసుపు - ఒక టీస్పూన్, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - ఒక కట్ట, నూనె - సరిపడా.
మసాలా కోసం: కరివేపాకు - నాలుగు కట్టలు, దాల్చిన చెక్క - అంగుళం, అనాసపువ్వు - ఒకటి, యాలకులు - రెండు, సోంపు - రెండు టీస్పూన్లు, ఎండుమిర్చి - రెండు, మిరియాలు - ఒక టీస్పూన్.
తయారీ విధానం: ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక కరివేపాకు, దాల్చినచెక్క, అనాస పువ్వు, యాలకులు, సోంపు, ఎండుమిర్చి, మిరియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై మందంగా ఉన్న పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక అల్లం, వెల్లుల్లి వేసి వేగించాలి. తరువాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి, పసుపు, చికెన్ వేసి కలుపుకోవాలి. చికెన్ ముక్కలు కాస్త ఉడికిన తరువాత రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు మసాల, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి చికెన్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మసాల పాన్ అడుగుభాగంలో మాడిపోతున్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. మూత పెట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.