కోడిని తీసుకొచ్చి కూర వండమని చెప్తే.. వండలేదని..

ABN , First Publish Date - 2020-04-08T21:21:53+05:30 IST

మల్లిశాల గ్రామశివారు జీడిమామిడి తోటలో గత నెల 28న మహిళను హత్యచేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ వై.రాంబాబు వివరాలు వెల్లడించారు.

కోడిని తీసుకొచ్చి కూర వండమని చెప్తే.. వండలేదని..

హత్యకేసులో నిందితుడి అరెస్టు

జగ్గంపేట (తూర్పు గోదావరి జిల్లా): మల్లిశాల గ్రామశివారు జీడిమామిడి తోటలో గత నెల 28న  మహిళను హత్యచేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జగ్గంపేట సర్కిల్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ వై.రాంబాబు వివరాలు వెల్లడించారు. మండలంలోని మల్లిశాల గ్రామంలో అత్తలూరి శ్రీనివాసరావుకు చెందిన జీడిమామిడి తోటలో రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు అలాగే సిరికింతలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి కాపలాదారులుగా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. అయితే మార్చి 28న వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర వండాలని చెప్పడంతో అందుకు లక్ష్మీ అంగీకరించలేదు. దీంతో లక్ష్మిని అతడు కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. 29న ఆమె మృతదేహాన్ని వెంకటేశులు సిరికింతలపాడు తీసుకుని వెళ్లాడు. లక్ష్మి కుమారుడు దీనిని గ్రహించి జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ వై.రాంబాబు, ఎస్‌ఐ టి.రామకృష్ణ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పంచనామా నిర్వహించారు. అయితే పరారీలో ఉన్న నిందితుడు ఈనెల 6వ తేదీన జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామ వీఆర్వో దగ్గర లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని అరెస్టుచేసి కోర్డులో హాజరు పరిచామని సీఐ తెలిపారు. 

Updated Date - 2020-04-08T21:21:53+05:30 IST