Chicago ఇండియానా నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-06-13T12:35:32+05:30 IST

చికాగో నగరంలోని నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు....

Chicago ఇండియానా నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

చికాగో: చికాగో నగరంలోని నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.తెల్లవారుజామున ఇండియానా నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు చికాగో పోలీసులు తెలిపారు.చికాగోకు ఆగ్నేయంగా ఉన్న గ్యారీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు  సమాచారం. ప్లేయోస్ నైట్‌క్లబ్ ప్రవేశ ద్వారం దగ్గర 34 ఏళ్ల వ్యక్తి ఉన్నాడని, లోపల 26 ఏళ్ల మహిళ కనిపించిందని పోలీసులు తెలిపారు.ఈ కాల్పుల్లో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు.మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చికాగో పోలీసులు తెలిపారు.కాల్పులకు దారితీసిన పరిస్థితులు, మృతుల పేర్లు,వారి సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. 


Updated Date - 2022-06-13T12:35:32+05:30 IST