కరోనా ఎఫెక్ట్.. చికాగో సిటీ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2020-11-13T20:37:28+05:30 IST

అమెరికా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చికాగో నగర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు విపరీతంగా పె

కరోనా ఎఫెక్ట్.. చికాగో సిటీ కీలక నిర్ణయం!

వాషింగ్టన్: అమెరికా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చికాగో నగర అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చికాగో సిటీలో స్టే హోం అడ్వైజరీని జారీ చేశారు. వచ్చే వారం నుంచి ఈ అడ్వైజరీ అమలులోకి రాబోతున్నట్లు ప్రకటించారు. 30 రోజులపాటు స్టే హోం అడ్వైజరీ అమలులో ఉంటుందని వెల్లడించారు. అత్యవసర వస్తువులు కొనుగోలు చేయడానికి, స్కూల్, ఆఫీస్‌కి వెళ్లడానికి తప్ప పట్టణ ప్రజలు ఇంటి నుంచి బయటికి రావొద్దని అధికారులు  సూచించారు. సమావేశాలు, సోషల్ ఈవెంట్‌లలో సభ్యుల సంఖ్య 10 మందికి మించరాదని తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1.2లక్షలకు చేరింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య కోటి దాటింది. మహమ్మారి అమెరికాలో సుమారు 2.48లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 


Updated Date - 2020-11-13T20:37:28+05:30 IST