ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ABN , First Publish Date - 2022-01-25T00:03:28+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా భరండా పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన

ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణపూర్‌ జిల్లా భరండా పోలీస్‌స్టేషన్‌ పరిధి అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు దళాల మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందాడు. ఈ ఘటనలో భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. భరండా అటవీప్రాంతంలో కిస్‌కోడో ఏరియా కమిటీ మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో డీఆర్జీ బలగాలు ఆదివారం కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఇరువర్గాల మధ్య సుదీర్ఘ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక తుపాకీ, పేలుడు పదార్థాలు, మందులు, ఇతర సామాగ్రి లభించినట్లు  డీఎస్పీ అనూజ్‌కుమార్‌ ప్రకటించారు.

Updated Date - 2022-01-25T00:03:28+05:30 IST