Abn logo
Oct 5 2021 @ 15:32PM

ప్రియాంకను నిర్బంధించిన గెస్ట్ హౌస్‌పై DRONE సంచారం: భూపేశ్ బఘెల్

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని నిర్బంధించిన సీతాపూర్‌‌లోని పీఏసీ గెస్ట్ హౌస్ పైన ఒక డ్రోన్ సంచరించినట్టు ఆయన ఆరోపించారు. 30 గంటలుగా ఆమెను నిర్బంధంలోనే ఉంచారని, ఆమెను ఉంచిన గదిపైన ఒక డ్రోన్ ఎగురుతూ కనిపించిందని హిందీలో ఆయన ట్వీట్ చేసారు. భవంతిపై ఎగురుతున్న డ్రోన్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

దీనికి ముందు, ప్రియాంక గాంధీ ఒక ట్వీట్‌లో తనను ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా 28 గంటలుగా నిర్బంధంలో ఉంచారని తెలిపారు. రైతులపై ఎస్‌వీయూలను దారుణంగా నడిపించి బెంబేలెత్తించిన వీడియోను కూడా షేర్ చేశారు. లఖింపూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులను పరామర్శించేందుకు సోమవారంనాడు వెళ్లిన ప్రియాంకను సీతాపూర్‌ వద్ద యూపీ పోలీసులు అరెస్టు చేసి, గెస్ట్ హౌస్‌కు తరలించారు.


ఇవి కూడా చదవండిImage Caption