చంద్రగిరి జంటలకు ‘చెవిరెడ్డి’ పెళ్లికానుక.. ఒక్కోక్కరికి..

ABN , First Publish Date - 2021-09-14T12:30:06+05:30 IST

చంద్రగిరి నియోజకవర్గంలోని కాబోయే వధూవరులకు

చంద్రగిరి జంటలకు ‘చెవిరెడ్డి’ పెళ్లికానుక.. ఒక్కోక్కరికి..

తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలోని కాబోయే వధూవరులకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ‘పెళ్లికానుక’ అందిస్తున్నారు. ఒక్కో జంటకు దాదాపు రూ.20 వేలతో బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పట్టు వస్త్రాలను ఇస్తున్నారు. తొలుత తిరుపతి రూరల్‌ మండలం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో వివాహం చేసుకునే వారికి అందజేసేవారు. ఇకపై చంద్రగిరి నియోజకవర్గంలోని జంటలు ఎక్కడ వివాహం చేసుకున్నా ఈ పెళ్లికానుక అందించాలని నిర్ణయించారు.


 ఈ మేరకు సోమవారం తుమ్మలగుంటలో తొలిసారి ఏడు జంటలకు ఈ కానుకను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అందజేసి.. ప్రారంభించారు. కాబోయే జంటలు వివాహానికి సంబంధించిన ఆధారాలను చూపించి ఈ కానుక పొందవచ్చని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. అంతకుముందు కల్యాణ వేంకటేశ్వర స్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు మాజీ సర్పంచ్‌ మూలం చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-14T12:30:06+05:30 IST