చేవెళ్ల సెంటిమెంట్‌గా..

ABN , First Publish Date - 2021-10-20T04:56:11+05:30 IST

వైఎస్‌ ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేవెళ్ల నుంచి

చేవెళ్ల సెంటిమెంట్‌గా..
సభా ప్రాంగణంలో జరుగుతున్న వేదిక ఏర్పాటు పనులు

  • నేటి నుంచి ‘షర్మిల’ పాదయాత్ర
  • ఆరంభ సభకు భారీగా జనసమీకరణ
  • ఉమ్మడి జిల్లాలో 120 కి.మీ యాత్ర
  • తొలిరోజు చేవెళ్ల నుంచి నక్కలపల్లి వరకు 11 కి.మీ..
  • వైఎస్‌ పాదయాత్రను తలపించేలా ఏర్పాట్లు 


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ చేవెళ్ల) : వైఎస్‌ ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల చేవెళ్ల నుంచి నేడు ప్రారంభించనున్న పాదయాత్రకు అన్నిఏర్పాట్లు పూర్తయ్యాయి. పాదయాత్ర ప్రారం భం సందర్భంగా చేవెళ్లలో నిర్వహించే బహిరంగసభను విజయ వంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీగా జనసమీకరణ చేస్తు న్నాయి. కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల చేపడుతున్న పాద యాత్రపై ఆ పార్టీ నాయకత్వం భారీ అంచనాలు పెట్టుకుంది. ఇప్పటివరకు పార్టీలోకి చరిష్మా ఉన్న నేతలు రాకపోవడంతో పాద యాత్ర ఎలా సాగుతుంది? పార్టీలో చేరికలు ఎలా ఉండబోతు న్నాయానే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చసాగుతోంది. ఇదిలాఉంటే తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సెంటి మెంట్‌గా ఉన్న ‘చేవెళ్ల’ నుంచే షర్మిల పాదయాత్రకు స్వీకారం చు డుతుండడంతో స్థానికంగా కూడా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరు వాత వైఎస్‌ షర్మిల వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించి రాజ్యా ధికారం కోసం తొలిఅడుగు చేవెళ్ల నుంచే వేయాలని నిర్ణయించారు.  తన తండ్రి వైఎస్‌కు ఎంతో అచ్చివచ్చిన  చేవెళ్ల నుంచే పాద యాత్రకు సిద్ధమయ్యారు. నేడు చేవెళ్ల నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర 14నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలం వేదికకు  వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం వేదిక అని నామకరణం చేశారు.  షర్మిల హైదరాబాద్‌ నుంచి బయలుదేరి  ఉదయం 10 గంటలకు చేవెళ్ల లోని సభా స్థలికి చేరుకుంటారు. వైఎస్‌ఆర్‌ ప్రజాప్రస్థానం వేదిక పైనే షర్మిల సర్వమత ప్రార్థనలు  నిర్వహిస్తారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఉదయం 11 :30గంటలకు పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి చేవెళ్లలోని షాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలాలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కందవాడ గ్రామం మీదుగా  పాదయాత్ర కొనసాగి స్తారు. ఆ గ్రామంలో మాటా ముచ్చట అనే కార్యక్రమం ద్వారా గ్రామస్తులతో షర్మిల ముఖా ముఖీగా మాట్లాడుతారు. మొదటి రోజు పాదయాత్ర నక్కల పల్లిలో సాయంత్రం 6గంటలకు ముగియ నుంది. ఇక్కడ  షర్మిల రాత్రి బస చేయనున్నారు. 


సమీప గ్రామాల నుంచి జనసమీకరణ

చేవెళ్లలో షర్మిల బహిరంగ సభకు చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. గతంలో వైఎస్‌ పాదయాత్రను గుర్తుకు తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  సభకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా భోజనం, తాగునీరు సైతం సమకూర్చుతున్నారు. సభకు భారీ జనసమీ కరణతోపాటు షర్మిల పాదయాత్ర కొనసాగే సమయంలో ఆమె వెంట వందలాది మంది నడిచే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. బహిరంగసభ స్థలాన్ని వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాఘవరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి మంగళవారం  పరి శీలించారు. షర్మిల మొదటిరోజు పాదయాత్ర చేవెళ్లలో ప్రారంభమై 11కిలోమీటర్లు కొనసాగనుంది. ఉమ్మడిరంగారెడ్డిజిల్లాలో నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమా రు 9రోజులపాటు 120 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 


చేవెళ్లలో నీలిజెండాల రెపరెపలు

వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్ర సందర్భంగా ఆపార్టీ నాయకులు చేవెళ్ల మండల కేంద్రంలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలను రోడ్డుకు ఇరువైపులా భారీగా ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద మాజీ సీఎం  దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, పార్టీ అధినేత్రి షర్మిల కటౌట్‌లు భారీగా ఏర్పాటు చేశారు. అలాగే మండల కేంద్రంలోని షాబాద్‌ చౌరస్తా వద్ద సైతం భారీగా పార్టీ నీలి జెండాలను ఏర్పాటు చేశారు. దీంతో చేవెళ్ల ప్రాంతం వైఎస్‌ఆర్‌ పార్టీ  నీలి జెండాలతో కళకళలాడుతోంది. 


ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకే షర్మిల పాదయాత్ర

వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి

ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని, టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే వైఎస్‌ఆర్‌ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట మహా పాదయాత్ర చేస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. మంగళవారం షర్మిల పాదయాత్ర మొదలుపెట్టే సభాస్థలాన్ని పరిశీ లించి మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడికి పోయాయని ప్రజలకు తెలియజేస్తూ, వారి సమస్యలను తెలుసుకోవడమే పాదయాత్ర ముఖ్య లక్ష్యమన్నారు. షర్మిల పాదయాత్ర చేస్తామని చెప్పినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీలో వణుకు మొదలైందన్నారు.  కేసీఆర్‌ పాలన నిజాయితీగా ఉంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు సభలు పెడుతున్నారు. నీవు, నీవు కొడుకు ఇంట్లోనే ఉండండి, ఎందుకు అందరికీ లేనిపోని ఆశలు కల్పించి, పదవులు ఇస్తున్నారని ప్రశ్నించారు.



Updated Date - 2021-10-20T04:56:11+05:30 IST