నేలపల్లెలో చిరుత సంచారం

ABN , First Publish Date - 2021-12-04T07:07:26+05:30 IST

ఓ చిరుత మృతితో ఊపిరి పీల్చుకున్న జనం మరో చిరు ఛిత సంచారంతో భయాం దోళనకు గురవుతున్న ఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది.

నేలపల్లెలో చిరుత సంచారం
చిరుత అడుగులను పరిశీలిస్తున్న అటవీ అధికారులు

పెద్దపంజాణి, డిసెంబరు 3: ఓ చిరుత మృతితో ఊపిరి పీల్చుకున్న జనం మరో చిరు ఛిత సంచారంతో భయాం దోళనకు గురవుతున్న ఘటన పెద్దపంజాణి మండలంలో చోటుచేసుకుంది. గత బుధ వారం కొళత్తూరు పంచా యతీ గుత్తివారిప ల్లె సమీపం లో చిరుత మృతి చెందిన విషయం విదితమే. ఈ విషయం మరువక మునుపే శుక్రవారం ఉదయం అదే పంచాయతీలోని నేలపల్లె సమీపంలో ఓ కోళ్ళఫారం వద్ద చిరుత సంచారం చూసి ఉలిక్కిపడ్డారు. ఇందులో పనిచేస్తున్న కూలీలు గట్టిగా కేకలు వేయడంతో పంట పొలాల్లోకి పారిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. అటవీ అధికారులు కరణ్‌సింగ్‌, సురేంద్ర, ఎఫ్‌డీవోలు దొరస్వామి, శోభ అక్కడకు చేరుకుని చిరుత సంచరించిన ప్రాంతమంతా పరిశీలించి చిరుత అడుగులుగానే నిర్ధారించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా ఎవరూ తిరుగవద్దని, ఎలాంటి విషయం తెలిసినా వెంటనే సమాచారం అందివ్వాలన్నారు. 

Updated Date - 2021-12-04T07:07:26+05:30 IST