Abn logo
Apr 23 2021 @ 04:21AM

కరోనాతో పల్మనాలజిస్టు ఈశ్వర్‌ ప్రసాద్‌ మృతి

నివాళులర్పించిన ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి సిబ్బంది


ఎర్రగడ్డ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 30 సంవత్సరాలుగా పల్మనాలజిస్టుగా సేవలు అందించిన డాక్టర్‌ ఈశ్వర్‌ ప్రసాద్‌ కరోనా బారినపడి బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన చిత్రపటానికి ఛాతీ ఆస్పత్రి సిబ్బంది గురువారం నివాళులర్పించారు. ఈశ్వర్‌ ప్రసాద్‌ 1980 నుంచి 2010 వరకు తమ ఆస్పత్రిలో పల్మనాలజి్‌స్టగా సేవలు అందించారని ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబబ్‌ఖాన్‌ చెప్పారు. ఆయన ఆస్పత్రి అభివృద్ధిలో ఎంతో కృషి చేశారని అన్నారు.


10 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఈశ్వర్‌ప్రసాద్‌.. కొన్నాళ్లుగా విరించి ఆస్పత్రిలో సీనియర్‌ పల్మనాలజిస్టుగా సేవలు అందిస్తున్నారని చెప్పారు. టీబీనిర్ధారణలో ఆయన ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కాగా, ఈశ్వర్‌ ప్రసాద్‌ బేగంపేటలో నివాసముండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement