Cash prize: చెస్‌ క్రీడాకారులు, కోచ్‌లకు నగదు బహుమతి

ABN , First Publish Date - 2022-07-30T16:27:16+05:30 IST

చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram) వేదికగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు ఈ నెల 28వ తేదీ

Cash prize: చెస్‌ క్రీడాకారులు, కోచ్‌లకు నగదు బహుమతి

అడయార్‌(చెన్నై), జూలై 29: చెన్నై నగర శివారు ప్రాంతమైన మహాబలిపురం(Mahabalipuram) వేదికగా 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో నగరంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన వేళమ్మాల్‌ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు, కోచ్‌లు పాలుపంచుకుంటున్నారు. ఈ గ్లోబెల్‌ ఈవెంట్‌లో భారత జట్టు తరపున ఆడే క్రీడాకారుల్లో వేళమ్మాల్‌ విద్యాలయానికి చెందిన అభిదన్‌ భాస్కరన్‌, ఎస్‌.పి.సేతురామన్‌, కార్తికేయన్‌ మురళి, ఆర్‌.వైశాలి, ప్రఙ్ఞానంద ఆర్‌.గుకేష్‌ ఉన్నారు. వీరితో పాటు ఈ చెస్‌ పోటీల్లో పాల్గొనే భారత క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేసిన కోచ్‌ల్లో ఈ విద్యాలయానికి చెందిన నారాయణన్‌ శ్రీనాథ్‌, శ్యామ్‌ సుందర్‌, ప్రియదర్శన్‌(Priyadarshan) ఉన్నారు. వీరిని ప్రోత్సహించేలా రూ.30 లక్షల నగదు బహుమతిని వారికీ అందజేశారు. ఆలప్పాక్కంలోని వేళమ్మాల్‌ విద్యాలయలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆరోగ్య మంత్రి ఎం.సుబ్రమణ్యం పాల్గొని నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కారప్పాక్కం ఎమ్మెల్యే గణపతి(Ganapati), పారిశ్రామికవేత్త సీకీఏ కుమారవేల్‌, భగవాన్‌ సైబర్‌టాక్‌ గ్లోబల్‌ సీవోవో మైక్‌ మురళీధరన్‌, చెన్నై డిస్ట్రిక్ట్‌ చెస్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ గణేశన్‌, చెస్‌ కోచ్‌ రమేష్‌, వేళమ్మాల్‌ నెక్సస్‌ కరప్పాండెంట్‌ ఎంవీఎం వేల్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-30T16:27:16+05:30 IST