ఆవోపా ఆధ్వర్యంలో చదరంగం పోటీలు

ABN , First Publish Date - 2022-05-25T05:09:11+05:30 IST

ఆర్య వైశ్య అఫిషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ (ఆవోపా) సంస్థ ఆధ్వర్యంలో యూనిట్‌, జోన్‌, రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను నిర్వహించనున్నట్లు అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీ్‌షకుమార్‌, ఖేడ్‌ యూనిట్‌ శాఖ అధ్యక్షుడు కోటగిరిసతీష్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు.

ఆవోపా ఆధ్వర్యంలో చదరంగం పోటీలు

నారాయణఖేడ్‌, మే 24: ఆర్య వైశ్య అఫిషియల్‌ అండ్‌ ప్రొఫెషనల్స్‌ (ఆవోపా) సంస్థ ఆధ్వర్యంలో యూనిట్‌, జోన్‌, రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలను నిర్వహించనున్నట్లు అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీ్‌షకుమార్‌, ఖేడ్‌ యూనిట్‌ శాఖ అధ్యక్షుడు కోటగిరిసతీష్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. యూనిట్‌ స్థాయి పోటీలు ఈనెల 29న ఖేడ్‌ నియోప్రగతి ఉన్నత పాఠశాలలో, జోన్‌ స్థాయి పోటీలు జూన్‌5న సంగారెడ్డిలో, రాష్ట్ర స్థాయిలో పోటీలు జూన్‌ 12న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించనున్నట్లు వారు చెప్పారు. మొదటి కేటగిరిలో 12 సంవత్సరాల లోపు బాలబాలికలు, రెండో కేటగిరిలో 18 సంవత్సరాల లోపు బాలబాలికలు, మూడో కేటగిరిలో 18 సంవత్సరాలు పైబడ్డ యువతీ యువకులు, పెద్దలు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతుల కింద నగదుతో పాటు జ్ఞాపికలు, ధ్రువపత్రాలను అందజేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఖేడ్‌ నియోప్రగతి పాఠశాల ప్రిన్సిపాల్‌ కె.ప్రకాష్‌ 7382174758, సతీ్‌షకుమార్‌ 9440880869, కోటగిరిసత్యనారాయణ 9440765746 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2022-05-25T05:09:11+05:30 IST