Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ.47.26లక్షలు

నార్కట్‌పల్లి, నవంబరు 26: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తుల నుంచి రూ.47.26లక్షల ఆదాయం సమకూరింది. 71 రోజులుగా రామలింగేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన నగదును శుక్రవారం లెక్కించారు. గట్టుకింద అమ్మవారి హుండీ ఆదాయం రూ.5,16,075 రాగా, గట్టుపైన స్వామివారి హూండీ ఆదాయం రూ. 42,10,915, మొత్తంగా 47,26,990 రూపాయల ఆదాయాన్ని ఆలయ ఖజానా కు జమ చేశామని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మేకల అరుణ తెలిపారు. అందులో విదేశీ కరెన్సీ 25 డాలర్లు ఉన్నాయి. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మహేంద్రకుమార్‌, చెర్వుగట్టు ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు దేవేందర్‌, వేణు, యాదయ్య, శంకరయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


కోటమైసమ్మ బ్రహ్మోత్సవాలు షురూ

నిడమనూరు: మండలంలోని ఇండ్లకోటయ్యగూడెం సమీపంలో ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు సుప్రభాత సేవ, విఘ్నేశ్వర పూజ, యాగశాల ప్రవేశం, చండీహోమం, పూర్ణాహు తి నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేయడంతో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవా లు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్‌, ట్రస్టీ చెవిటి ఆంజనేయులు, ఈవో సిరికొండ నవీన్‌, సిబ్బం ది విఠల్‌, రాజు, రమణయ్య, కోటయ్య, వెంకన్న, పద్మ, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement