చెరువు గండి పూడ్చేది ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-05-13T05:52:20+05:30 IST

చెరువుకు గండి పడి అర్ధరాత్రి నీరు ఊరిని ముంచెత్తింది. ఎనిమిది నెలలైనా ప్రభుత్వం కట్టకు మరమ్మతులు చేయించలేదు. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం అచ్చంపేట గ్రామ పరిధిలోని పెద్దచెరువు గతేడాది అక్టోబరు 20న అర్ధరాత్రి కట్ట తెగిపోయింది. నీరు గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులు భయభ్రాంతలకు గురయ్యారు. చెరువుకు అడ్డుకట్ట వేయడానికి గ్రామస్థులు ఎంతగా ప్రత్నించినా ఫలితం లేకుండాపోయింది. తెల్లవారేసరికి నీరంతా వృథాగా పోవడంతో చెరువు బోసిపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. వర్షం పడితే చుక్క నీరు కూడా నిలవడం లేదు.

చెరువు గండి పూడ్చేది ఎప్పుడో?
అచ్చంపేట చెరువుకు పడిన గండి

ఎనిమిది నెలల క్రితం అచ్చంపేట చెరువుకు గండి

అర్ధరాత్రి గ్రామాన్ని ముంచెత్తిన నీరు

మరమ్మతులు చేయని నీటిపారుదల శాఖ

వర్షాకాలం సమీపిస్తుండటంతో ఆందోళన


నర్సాపూర్‌, మే 12: చెరువుకు గండి పడి అర్ధరాత్రి నీరు ఊరిని ముంచెత్తింది. ఎనిమిది నెలలైనా ప్రభుత్వం  కట్టకు మరమ్మతులు చేయించలేదు. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం అచ్చంపేట గ్రామ పరిధిలోని పెద్దచెరువు గతేడాది అక్టోబరు 20న అర్ధరాత్రి కట్ట తెగిపోయింది. నీరు గ్రామాన్ని ముంచెత్తడంతో గ్రామస్థులు భయభ్రాంతలకు గురయ్యారు. చెరువుకు అడ్డుకట్ట వేయడానికి గ్రామస్థులు ఎంతగా ప్రత్నించినా ఫలితం లేకుండాపోయింది. తెల్లవారేసరికి నీరంతా వృథాగా పోవడంతో చెరువు బోసిపోయింది. నీటిపారుదల శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. వర్షం పడితే చుక్క నీరు కూడా నిలవడం లేదు. కట్టను పూర్తిస్థాయిలో పునర్‌నిర్మిస్తే తప్ప చెరువులో నీరు ఉండని పరిస్థితి. ఈ చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు ఉన్నది. మరమ్మతులు చేయకపోతే ఖరీఫ్‌ సీజన్‌లో పంటలు వేసుకోవడం సాధ్యం కాదు. మరో నెల రోజులలో వర్షాకాలం రానుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చెరువు కట్టను అప్పట్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో చెరువు కట్ట మరమ్మతుకు రూ. 50 లక్షలు ఖర్చవుతాయని అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేసి రాష్ట్రస్థాయి అధికారులకు పంపించారు. అయితే ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. నెలరోజుల్లో వర్షకాలం రానున్నందున నిధులు మంజూరు కాకపోవడంతో గ్రామస్థులు ఆందోళ చెందుతున్నారు. వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు వచ్చే ప్రమాదముంటుందని వాపోతున్నారు. వెంటనే నిధులు ఇస్తేనే వర్షాలు వచ్చే లోపు పనులు చేయడం సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు.

Read more