చెరువుకు గండ్లు.. బీళ్లుగా భూములు

ABN , First Publish Date - 2021-02-27T05:46:54+05:30 IST

పూసలపాడు చెరువు కు తరచుగా గండ్లు పడుతుండటంతో భూములు బీళ్లుగా మారుతున్నారు.

చెరువుకు గండ్లు.. బీళ్లుగా భూములు
పూసలపాడు చెరువుకు పడిన గండి(ఫైల్‌)

రూ.కోట్లతో మరమ్మతులు

పనులు మధ్యలోనే కట్ట తెగిన వైనం

పట్టించుకోని అధికారులు

పూసలపాడు వాసుల పాట్లు

బేస్తవారపేట, ఫిబ్రవరి 26: పూసలపాడు చెరువు కు తరచుగా గండ్లు పడుతుండటంతో భూములు బీళ్లుగా మారుతున్నారు. ఈ చెరువు కింద మూడు గ్రామాల పరిధిలో 800 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువుకు పండిన గండ్లు పూడ్చడానికి ఏటా మర మ్మతుల పేరిట రూ.కోట్లు మంజూరు చేస్తున్నారు. ఈ మరమ్మతులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నారు. నాణ్యత లోపంతో చిన్నపాటి  వర్షానికే గండ్లు పడు తున్నాయి. 

గత ఏడాది ప్రపంచబ్యాంక్‌ నుండి చెరువు మరమ్మతులకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయి. సాంకేతిక అధికారులు మట్టిని పరిశీలించకుండా పను లు ప్రారంభించారు. సుమారు రూ.67 లక్షల వరకు ఖర్చు చేశారు. గత ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు చెరువుకు గండ్లు పడ్డాయి. చుక్కనీరు లేక చెరు వు ఖాళీ అయింది. ఈక్రమంలో గ్రామ సమీపంలో భూగర్భజలాలు అడుగంటడంతో తాగునీటికి ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి.

గత రెండు దశాబ్దాల నుంచి  చెరువు తెగటం, మరమ్మతులు చే యడం పరిపాటిగా మారింది. ఈ సారి అలాకాకుండా చెరువుకు ముందు కట్ట బాగం పూర్తిగా తొలగించి బంక మట్టితో కట్ట ఏర్పాటుచేసేవిధంగా అధికారులు రూపొందించారు. దాని ప్రకారమే చెరువు కట్ట పూర్తి చేసిన వారంలోనే వర్షం రావడంతో చెరువు నిండిపోయింది. ఈ ఆనందం ఎంతోకాలం లేదు.  చెరువు నిండిన గం టలోనే గండి పడింది.  గత నాలుగు నెలల నుంచి అధికారులు వస్తున్నారు..పోతున్నారు గాని చెరువు పరిస్థితి పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చెరువును పరిశీలించి మట్టిని గుంటూరు ల్యాబ్‌ టెస్టింగ్‌ పంపగా, ఈ మట్టి గట్టుకు పనికిరాదని నిర్ధారణ జరిగినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలుపుతున్నారు.  దీం తో పూసలపాడు చెరువు పరిస్థితి ఇంతేనా అని గ్రామ స్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ చెరువు కింద 800 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులో నీరులేక భూగర్భ జలాలు తగ్గటంతో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. తాగునీటికి  ఇబ్బందులు తలెత్తు తున్నాయి. రానున్న వర్షాకాలంలోపు ఈచెరువుకు పూ ర్తిగా మరమ్మతులు నిర్వహించి తమ ఇబ్బందులను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

Updated Date - 2021-02-27T05:46:54+05:30 IST