దురవస్థలో చెన్నూర్‌ ఆస్పత్రి భవనాలు

ABN , First Publish Date - 2020-07-11T08:31:22+05:30 IST

చెన్నూర్‌ నియోజక వర్గం లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 30 పడకల ఆస్పత్రి, జైపూర్‌ మండలంలోని కుందారం..

దురవస్థలో చెన్నూర్‌ ఆస్పత్రి భవనాలు

మంత్రి ఈటలతో బాల్క సుమన్‌


హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): చెన్నూర్‌ నియోజక వర్గం లోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ 30 పడకల ఆస్పత్రి, జైపూర్‌ మండలంలోని కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల పెచ్చులు ఊడుతున్నాయని, వాటి గోడలు కులిపోతున్నాయని మంత్రి ఈటల రాజేందర్‌ దృష్టికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ తీసుకెళ్లారు. రెండు భవనాలు చాలా ఏళ్ల క్రితం నిర్మించినవే అని తెలిపారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి  సుమన్‌ ఈటలను శుక్రవారం  కలిశారు. తన నియోజక వర్గంలోని ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,  సబ్‌ సెంటర్ల పరిస్థితులను  వివరించారు. చెన్నూర్‌లో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో జరగాల్సిన పనుల గురించి సుమన్‌ చర్చించారు.

Updated Date - 2020-07-11T08:31:22+05:30 IST