చెన్నూర్‌ కోఆప్షన్‌ సభ్యుల ఏకగ్రీవం

ABN , First Publish Date - 2020-08-08T06:07:24+05:30 IST

చెన్నూర్‌ మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఏకగ్రీవమైనట్లు మున్సిపల్‌ ఇంజనీర్‌ సాయికిరణ్‌ పేర్కొన్నారు.

చెన్నూర్‌ కోఆప్షన్‌ సభ్యుల ఏకగ్రీవం

చెన్నూర్‌, ఆగస్టు 7: చెన్నూర్‌ మున్సిపాలిటీలో కోఆప్షన్‌ సభ్యుల ఎంపిక ఏకగ్రీవమైనట్లు మున్సిపల్‌ ఇంజనీర్‌ సాయికిరణ్‌ పేర్కొన్నారు. నాలుగు కోఆప్షన్‌ సభ్యులకు గాను నాలుగు నామినేషన్‌లు దాఖలు కావడంతో శుక్రవారం వారికి ధ్రువీకరణ పత్రాలను అందించారు. కోఆప్షన్‌ సభ్యులుగా కొండపర్తి లక్ష్మీ, కొమ్మెర మార్కండేయ శ్రీనివాస్‌, షమాఆఫ్రీన్‌, మహమ్మద్‌ ఆయూబ్‌ ఎన్నికయ్యారు. కోఆప్షన్‌ సభ్యులను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా, వైస్‌ చైర్మన్‌ నవాజోద్దీన్‌, పలువురు కౌన్సిలర్లు అభినందించారు.

Updated Date - 2020-08-08T06:07:24+05:30 IST