మాస్క్‌ ప్లీజ్...

ABN , First Publish Date - 2022-07-05T13:05:54+05:30 IST

నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కరోనా నిరోధక నిబంధనలను

మాస్క్‌ ప్లీజ్...

- థియేటర్లు, వాణిజ్యసంస్థల సిబ్బందికీ తప్పనిసరి! 

- గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ఉత్తర్వులు


చెన్నై, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ అధికారులు కరోనా నిరోధక నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు నగరంలోని సినిమా థియేటర్లు, వస్త్రదుకాణాలు, వాణిజ్య సంస్జలు, దుకాణాలు, హోటళ్లు, టీ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్‌ అధికారులు ఓ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం నగరమంతటా కరోనా ముందస్తు వైద్య పరీక్షల శిబిరాలు, టీకా శిబిరాలను నిర్వహిస్తున్నామని, అయినా కరోనా కేసులు తగ్గకపోవటంతో వైరస్‌ నిరోధక నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నగరవాసులు బహిరంగ ప్రదేశాల్లో, జనం అధికంగా గుమికూడే ప్రాంతాల్లో మాస్కు ధరించటంతోపాటు భౌతిక దూరాన్ని కూడా పాటించాలని కోరారు. వాణిజ్య సంస్థలన్నీ తమ దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులతో విధిగా మాస్కు దరింపజేయాలని సూచించారు. దుకాణాలకు వచ్చేవారు కూడా మాస్కు ధరించేలా సూచించాలన్నారు. ఇదే విధంగా సినిమా థియేటర్లు, హోటళ్లు, టీ దుకాణాలు, హార్డ్‌వేర్‌ దుకాణాల సిబ్బంది, ఉద్యోగులు విధిగా మాస్కు దరించాలన్నారు. ఈ నిబంధనలను ఉల్లఘించే థియేటర్లు, దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్‌ అధికారులు హెచ్చరించారు. ఇదే విధంగా ఇంటి నుంచి బయలుదేరే వారు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం వస్తే వెంటనే కరోనా ముందస్తు వైద్యపరీక్షలు జరుపుకోవాలని కూడా ఆదేశించారు. మాస్కులు ధరించకుండా సంచరించేవారికి జరిమానా కూడా విధిస్తామని తెలిపారు.  పతివార్డులోనూ కౌన్సిలర్లు కరోనా నిరోధక నిబంధనలు పాటిస్తున్నారో లేదో ఎప్పటికప్పుడూ పర్యటించి పరిశీలించాలని కోరారు.



Updated Date - 2022-07-05T13:05:54+05:30 IST