భయపడొద్దు

ABN , First Publish Date - 2022-01-19T04:46:32+05:30 IST

చెన్నారెడ్డిపల్లి ప్రజలెవ్వరూ భయపడవద్దని.. అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి మనోరమ అన్నారు.

భయపడొద్దు
గ్రామంలో మురుగు నీటి నిల్వలను పరిశీలిస్తున్న జిల్లా మలేరియా అధికారి

చెన్నారెడ్డిపల్లిని పరిశీలించిన జిల్లా మలేరియా అధికారి మనోరమ  

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


పొదలకూరు, జనవరి 18 : చెన్నారెడ్డిపల్లి ప్రజలెవ్వరూ భయపడవద్దని.. అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి మనోరమ అన్నారు. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో  ‘విజృంభిస్త్తున్న విష జ్వరాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో మండలంలోని చెన్నారెడ్డిపల్లిని ఆమె పరిశీలించగా.. గ్రామంలో  దాదాపు 90శాతం మంది జ్వరాలతో బాధపడుతున్న విషయాన్ని వైద్యాధికారులు గుర్తించారు. దీంతో డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు సిబ్బందితో ఇంటింటికి వెళ్లి రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు.   కలుషిత నీటి వలన గ్రామస్థులు జ్వరాల బారిన పడి ఉంటారని ప్రాథమిక అంచనా వేశారు. గ్రామస్థులు విధిగా దోమతెరలు వాడాలని, కాచి చల్లార్చిన నీళ్లను మాత్రమే తాగాలన్నారు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలన్నారు.  గ్రామంలోని ప్రతి ఇంటిని యాంటీ లార్వా స్ర్పెయింగ్‌ అబెట్‌ ద్రావణంతో పిచికారీ చేయించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహమ్మదాపురం డాక్టర్‌ రమేష్‌, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి ఆంజనేయవర్మ, హెల్త్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాసులు, మేరీ ఎవ్వాలిన్‌, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T04:46:32+05:30 IST