ఆ బాలిక వయసు 16 ఏళ్లు.. ఇంటర్మీడియెట్ చదువుతోంది.. తండ్రి లేని ఆ బాలికను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి కిరాతకంగా ప్రవర్తించింది.. తన ప్రియుడికి తన కూతురిని అప్పగించింది.. అతడు ఆ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు.. ఆ బాలికకు తల్లి రహస్యంగా డెలివరీ చేసింది.. డెలివరీ అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. చివరకు అక్కడ అసలు విషయం బయటపడింది.
చెన్నైకు చెందిన 38 ఏళ్ల మహిళ రోజు కూలీగా పనిచేస్తోంది. ఆమె 50 ఏళ్ల వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంది. అతని కన్ను తన ప్రియురాలి కూతురిపై పడింది. ఆ మహిళను ఒప్పించి ఆ బాలికపై అతను పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లితే తమ బంఢారం బయటపడుతుందనే భయంతో ఆ తల్లి కూతురిని తన ఇంటి బాత్రూమ్‌లో ఉంచి డెలివరీ చేసింది.
డెలివరీ తర్వాత ఆ బాలిక, ఆమెకు జన్మించిన శిశువు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లక తప్పలేదు. హాస్పిటల్‌లో ఆ బాలిక ఆధార్ కార్డు ద్వారా వయసు తెలుసుకున్న సిబ్బంది వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందిత మహిళను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి