Chennai ఓటర్లు 61,18,734 మంది

ABN , First Publish Date - 2021-12-10T13:45:58+05:30 IST

చెన్నై నగర పాలకసంస్థ(చెన్నై కార్పొరేషన్‌) పరిధిలోని ఓటర్ల సంఖ్య వివరాలను నగర కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ గురువారం వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం కార్పొరేషన్‌ పరిధిలోని 200 వార్డుల్లో మొత్తం

Chennai ఓటర్లు 61,18,734 మంది

- పురుషులు 30,23,803 మంది, స్త్రీలు 30,93,355 మంది

- కోడంబాక్కం జోన్‌లో అధిక ఓటర్లు 


అడయార్‌(చెన్నై): చెన్నై నగర పాలకసంస్థ(చెన్నై కార్పొరేషన్‌) పరిధిలోని ఓటర్ల సంఖ్య వివరాలను నగర కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ గురువారం వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం కార్పొరేషన్‌ పరిధిలోని 200 వార్డుల్లో మొత్తం 61,18,734 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్ల సంఖ్య 30,23,803గా వుండగా, మహిళా ఓటర్లు 30,93,355 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చెన్నై కార్పొరేషన్‌ పరిధిలోని ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల ప్రక్రియను కొన్ని వారాల పాటు చేపట్టారు. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను తయారు చేయగా, దీన్ని గురువారం కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయమైన రిప్పన్‌ బిల్డింగ్‌లో కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ, ఆర్థికం) విషు మహాజన్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. తాజాగా వెల్లడించిన జాబితా మేరకు హిజ్రాలు 1576 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, కోడంబాక్కం జోన్‌లో ఉన్న 137వ వార్డులో అత్యధికంగా 58,620 మంది ఓటర్లు ఉంటే, అతి తక్కువగా ఆలందూరు జోన్‌లోని 159వ వార్డులో 3,116 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. అలాగే, మొత్తం 200 వార్డుల్లో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను కూడా వెల్లడించారు. ఇందులో పురుషులకు కోసం 255 పోలింగ్‌ కేంద్రాలను, ఆల్‌ ఓటర్ల కోసం 5284 పోలింగ్‌ కేంద్రాలు, మహిళలకు 255 చొప్పున మొత్తం 5,794 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. గరిష్టంగా తేనాంపేట జోన్‌లో 622 వార్డులు, అతి తక్కువగా మణలి జోన్‌లో 94 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

Updated Date - 2021-12-10T13:45:58+05:30 IST