ఫోన్ రావడంతో వెళ్లారు.. అక్కడ ఉన్న వ్యక్తి పరిస్థితిని గమనించి.. ఈ ఎస్సై ఏం చేశారో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-12T13:47:34+05:30 IST

గురువారం..

ఫోన్ రావడంతో వెళ్లారు.. అక్కడ ఉన్న వ్యక్తి పరిస్థితిని గమనించి.. ఈ ఎస్సై ఏం చేశారో తెలిస్తే..

భుజం తట్టిన బాధ్యత!

వ్యక్తిని మోసుకెళ్లి ప్రాణాలు కాపాడిన ఎస్సై


చెన్నై(ఆంధ్రజ్యోతి): గురువారం.. చెన్నై టీపీ ఛత్రం పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రాజేశ్వరి ముంపు బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో ఉన్నారు. ఇంతలో ఆమెకు ఓ ఫోన్‌ వచ్చింది. కీల్పాక్‌లోని సిమెట్రీ వద్ద ఫుట్‌పాత్‌పై వ్యక్తి మృతదేహం పడి ఉందనేది దాని సారాంశం. ఆమె వెంటనే అక్కడకు వెళ్లారు. వర్షానికి బాగా తడిసి, ఫుట్‌పాత్‌మీద అచేతన స్థితిలో ఓ వ్యక్తి పడి ఉన్నాడు. అందరూ చనిపోయాడనే భావించారు. దగ్గరకు వెళ్లిన ఎస్‌ఐ పరిశీలించి చూడగా ఇంకా ఊపిరి ఉన్నట్టు తేలింది. అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని అనుకున్నారు. అయితే, తడిసిపోయి మురికిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రాజేశ్వరి స్వయంగా భుజాలపై ఎత్తుకుని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యంగా ఉన్నాడు.


ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఎస్సైని పోలీస్‌ ఉన్నతాధికారులతో పాటు నగరవాసులు అభినందనల్లో ముంచెత్తుతున్నారు. నగర పోలీస్‌ కమిషన్‌ శంకర్‌ జీవాల్‌ రాజేశ్వరిని స్వయంగా కమిషనరేట్‌కు పిలిపించుకుని అభినందించారు. అలాగే ప్రముఖ నటుడు కమల్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆమెను అభినందించారు. 

Updated Date - 2021-11-12T13:47:34+05:30 IST