Abn logo
Oct 20 2021 @ 08:14AM

chennai: మీ దాష్టీకాన్ని ఇక సహించం!

                      - tdp నేతలు చంద్రశేఖర్‌, మహేంద్ర


చెన్నై: ఏపీలో టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాష్టీకాన్ని చెన్నై తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి చంద్రశేఖర్‌ తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం సహనాన్ని చేతగాని తనం అనుకోరాదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. జగన్‌ వికృత, క్రూర బుద్ధి చూశాక ఆయన శాడిజం ప్రజలకు తెలుస్తోందన్నారు. పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే.. పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతారా? అని నిలదీశారు. ‘టీడీపీ కేంద్ర కార్యాలయాలపై గూండా మూకలతో దాడు లకు తెగబడతారా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని దాడులు చేయిస్తారు?’ అంటూ ప్రశ్నించారు. మీ పతనానికి ఒక్కో ఇటుకా మీరే పేర్చుకుంటున్నా రన్నారు. వైసీపీ అరాచకాలపై ఆగ్రహంగా వున్న తమ పార్టీ క్యాడర్‌కు తమ అధినేత కనుసైగ చేస్తే చాలని, వైసీపీ కార్యాలయాలను ధ్వంసం చేయడం ఒక్క నిముషంలో పని అని, వైసీపీ పెయిడ్‌ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ తరిమికొడతారని చంద్రశేఖర్‌ హెచ్చరించారు. డీజీపీ కార్యాలయం పక్కనే వున్న టీడీపీ కార్యాలయంపైనే దాడి జరుగు తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం క్షేమం కాదని, ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా ఖూనీ చేస్తున్న ఫ్యాక్షనిస్టులను ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.  


గూండాల దాడి అమానుషం: గడ్డం మహేంద్ర

తమ పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు తమ నేతలపై వైసీపీ గూండాలు దాడి చేయడం అమానుషమని చెన్నై టీడీపీ ఫోరం అధ్యక్షుడు మహేంద్రబాబు గడ్డం ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జగన్‌ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని, ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులు చేయించిన సీఎం నేడు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాలపై దాడి చేయించారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలకు తప్ప మరెవ్వరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు సభ్యసమాజం తల దించుకునేలా చంద్రబాబు పట్ల మాట్లాడారన్నారు. చంద్రబాబును నడిరోడ్డులో కాల్చి చంపాలని నాడు జగన్‌ అన్నప్పుడు టీడీపీ నేతలు వైసీపీ కార్యాలయాలపై దాడులు చేశారా అని ప్రశ్నించారు. 

ఇవి కూడా చదవండిImage Caption