Abn logo
Apr 20 2021 @ 05:28AM

చెన్నై.. చమక్‌

తిప్పేసిన మొయిన్‌ అలీ, జడేజా

200 చెన్నై కెప్టెన్‌గా  ధోనీ మ్యాచ్‌ల సంఖ్య

జడేజా 4   క్యాచ్‌లు 2  వికెట్లు

మొయిన్‌ అలీ (3/7)

రాజస్థాన్‌పై ఘనవిజయం


చెన్నై సూపర్‌ కింగ్స్‌ నుంచి మరోసారి ఆల్‌రౌండ్‌ షో.. వాస్తవానికి మంచు ప్రభావం ఉండడంతో సీఎ్‌సకే చేసిన 188 పరుగుల స్కోరు కూడా సరిపోదేమో అనిపించింది. దీనికి తగ్గట్టు రాజస్థాన్‌ ఛేదనను బట్లర్‌ దూకుడుగానే ఆరంభించాడు. కానీ మధ్య ఓవర్లలో చెన్నై స్పిన్‌ జోడీ మొయిన్‌ అలీ, జడేజా మ్యాజిక్‌ చేసింది. స్వల్ప వ్యవధిలోనే సగం వికెట్లను నేలకూల్చి రాజస్థాన్‌కు ఓటమిని కళ్లముందుంచారు. చేయాల్సి రన్‌రేట్‌ పెరిగిపోవడంతో ఆ జట్టు చేసేదేమీ లేకపోయింది.


ముంబై: తొలి మ్యాచ్‌ ఓటమి తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ జోరు పెంచింది. సమష్టి ఆటతీరుతో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. స్పిన్నర్‌ మొయిన్‌ అలీ (3-0-7-3) అదిరిపోయే బౌలింగ్‌తో రాజస్థాన్‌ వెన్నువిరిచాడు. జడేజా (2/28) కీలక సమయంలో వికెట్లు తీయగా.. ఫీల్డింగ్‌లోనూ నాలుగు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. దీంతో చెన్నై 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగుల భారీ స్కోరు సాధించింది. డుప్లెసి (17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), రాయుడు (17 బంతుల్లో 3 సిక్సర్లతో 27), చివర్లో బ్రావో (8 బంతు ల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 20 నాటౌట్‌) మెరుపులు మెరిపించాడు. సకారియాకు మూడు, మోరి్‌సకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసి ఓడింది. బట్లర్‌ (35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49) మాత్రమే రాణించాడు. సామ్‌ కర్రాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మొయిన్‌ అలీ నిలిచాడు.


వికెట్ల జాతర: భారీ ఛేదనలో రాజస్థాన్‌ నుంచి జోస్‌ బట్లర్‌ ఒక్కడే పోరాడాడు. స్పిన్నర్ల ధాటికి మిడిలార్డర్‌ కుప్పకూలింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్‌ మనన్‌ వోహ్రా (14), కెప్టెన్‌ శాంసన్‌ (1) వికెట్లను కోల్పోయింది. మరోవైపు బట్లర్‌ వరుస బౌండరీలతో ఎదురుదాడికి దిగాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన అతడు ఐదో ఓవర్‌లో 4,6.. ఎనిమిదో ఓవర్‌లో 4,4 బాదేయగా.. పదో ఓవర్‌లో సిక్సర్‌తో ఊపు మీద కనిపించాడు. కానీ అంతా సజావుగా సాగుతున్న వేళ రాజస్థాన్‌ ఒక్కసారిగా తడబడి ఐదు ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయింది. 12వ ఓవర్‌లో బట్లర్‌, శివమ్‌ దూబే (17)లను జడేజా అవుట్‌ చేశాడు. ఆ వెంటనే మొయిన్‌ అలీ తన వరుస ఓవర్లలో మిల్లర్‌ (2), పరాగ్‌ (3), మోరిస్‌ (0)ల వికెట్లను కూల్చడంతో 95/7 స్కోరుతో ఓటమి ఖాయమైంది. చివర్లో తెవాటియా (20), ఉనాద్కట్‌ (24) బౌండరీలతో జోరు చూపించినా అప్పటికే చాలా ఆలస్యమైంది. చివరి రెండు ఓవర్లలో 67 పరుగులు కావాల్సి ఉండడంతో ఓటమి ఖరారైంది.


ఆరంభం.. ముగింపు జోరుగా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నుంచి దాదాపుగా బ్యాట్స్‌మెన్‌ అంతా బంతులను వృథా చేయకుండా వేగంగా ఆడారు. దీంతో ఓవైపు వికెట్లు పడుతున్నా చెన్నై రన్‌రేట్‌ తొమ్మిదికి తగ్గకుండా సాగింది. అంతకుముందు తొలి బంతికే ఓపెనర్‌ రుతురాజ్‌ (10) వికెట్‌ను కోల్పోవాల్సింది. అయితే ఈ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోకుండా నాలుగో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ డుప్లెసి మాత్రం దుమ్ము రేపాడు. ఉనాద్కట్‌ ఓవర్‌లో 4,4,6,4తో చెలరేగి 19 పరుగులు రాబట్టాడు. అతడిని ఆరో ఓవర్‌లో మోరిస్‌ అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 46/2తో నిలిచింది.


ఆ తర్వాత మొయిన్‌ అలీ (20) ఏడో ఓవర్‌లో 4,6తో బాది పెవిలియన్‌కు చేరాడు. ఈ దశలో చెన్నై కీలక బ్యాట్స్‌మెన్‌ రైనా, రాయుడు కదం తొక్కారు. 11వ ఓవర్‌లో చెరో సిక్స్‌ బాదగా.. మరుసటి ఓవర్‌లో రాయుడు వరుసగా రెండు సిక్సర్లతో సత్తా చూపాడు. నాలుగో వికెట్‌కు 24 బంతుల్లో 45 పరుగులు అందాక ఒకే ఓవర్‌లో సకారియా ఈ ఇద్దరిని అవుట్‌ చేశాడు. ధోనీ (18) రెండు ఫోర్లతో కుదురుకున్నట్టే కనిపించినా సకారియా స్లో బాల్‌కు దొరికిపోయాడు. 19వ ఓవర్‌లో జడేజా (8) అవుటైనా చెన్నై 15 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో సామ్‌ కర్రాన్‌ (13), శార్దూల్‌ (1) రనౌట్స్‌ అయినా బ్రావో సిక్సర్‌తో 15 రన్స్‌ రాబట్టిన జట్టు 190కి చేరువైంది. ఆఖరి 5 ఓవర్లలో చెన్నై 62 పరుగులు సాధించింది.


స్కోరుబోర్డు

చెన్నై: రుతురాజ్‌ (సి) దూబే (బి) ముస్తాఫిజుర్‌ 10; డుప్లెసి (సి) పరాగ్‌ (బి) మోరిస్‌ 33; మొయిన్‌ అలీ (సి) పరాగ్‌ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్‌ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్‌ (బి) సకారియా 27; జడేజా (సి) శాంసన్‌ (బి) మోరిస్‌ 8; ధోనీ (సి) బట్లర్‌ (బి) సకారియా 18; సామ్‌ కర్రాన్‌ (రనౌట్‌) 13; బ్రావో (నాటౌట్‌) 20; శార్దూల్‌ (రనౌట్‌) 1; చాహర్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 20 ఓవర్లలో 188/9. వికెట్ల పతనం: 1-25, 2-45, 3-78, 4-123, 5-125, 6-147, 7-163, 8-174, 9-180. బౌలింగ్‌: ఉనాద్కట్‌ 4-0-40-0; సకారియా 4-0-36-3; ముస్తాఫిజుర్‌ 4-0-37-1; మోరిస్‌ 4-0-33-2; తెవాటియా 3-0-21-1; పరాగ్‌ 1-0-16-0.

రాజస్థాన్‌: బట్లర్‌ (బి) జడేజా 49, మనన్‌ ఓహ్రా (సి) జడేజా (బి) కర్రాన్‌ 14, శాంసన్‌ (సి) బ్రావో (బి) కర్రాన్‌ 1, శివమ్‌ దూబే (ఎల్బీ) (బి) జడేజా 17, డేవిడ్‌ మిల్లర్‌ (ఎల్బీ) (బి) అలీ 2, రియాన్‌ పరాగ్‌ (సి) జడేజా (బి) అలీ 3, రాహుల్‌ తెవాటియా (సి) రుతురాజ్‌ (బి) బ్రావో 20, క్రిస్‌ మోరిస్‌ (సి) జడేజా (బి) అలీ 0, ఉనాద్కట్‌ (సి) జడేజా (బి) శార్దూల్‌ 24, సకారియా (నాటౌట్‌) 0, ముస్తాఫిజుర్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 20 ఓవర్లలో 143/9. వికెట్లపతనం: 1-30, 2-45, 3-87, 4-90, 5-92, 6-95, 7-95, 8-137, 9-143. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 3-0-32-0, కర్రాన్‌ 4-0-24-2, శార్దూల్‌ 3-0-20-1, రవీంద్ర జడేజా 4-0-28-2, బ్రావో 3-0-28-1, మొయిన్‌ అలీ 3-0-7-3.

Advertisement
Advertisement
Advertisement