పెరంబూర్(చెన్నై): దేశ రాజధాని నగరం చెన్నైలో రెండో విమానాశ్రయ ఏర్పాటుపనులు త్వరలో చేపట్టనున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది. పార్లమెంటు సమావేశాల్లో బుధవారం రాష్ట్ర ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా బదులిస్తూ, చెన్నైలో రెండో విమానాశ్రయ ఏర్పాటుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నాలుగు ప్రాంతాలను సిఫారసు చేసిందన్నారు. వాటిని పరిశీలించి రెండు స్థలాలు ఎంపిక చేశామని, స్థలం ఎంపిక విషయమై రాష్ట్రప్రభుత్వ సమాధానం కోసం వేచి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు.
ఇవి కూడా చదవండి