రాజస్థాన్‌.. రాయల్‌గా..

ABN , First Publish Date - 2020-10-20T09:03:14+05:30 IST

ఆడిన మ్యాచ్‌లు.. గెలుపు, ఓటములు సమానంగా ఉన్న చెన్నై-రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన పోరు ఏకపక్షంగా ముగిసింది.

రాజస్థాన్‌.. రాయల్‌గా..

చెన్నైపై అలవోక విజయం 

 అదరగొట్టిన బట్లర్‌ 

200 ఐపీఎల్‌లో ధోనీ ఆడిన మ్యాచ్‌లు.

ఈ లీగ్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి 

ఆటగాడు మహీనే. 



ఆదివారం సూపర్‌ ఓవర్లతో దద్దరిల్లిన ఐపీఎల్‌.. రోజు గడిచేసరికి పూర్తి  ఏకపక్షంగా మారింది. అటు మ్యాచ్‌ మ్యాచ్‌కూ ప్లేఆఫ్స్‌ అవకాశాలు ప్రమాదకరంగా మారుతున్నా చెన్నై ఆటతీరులో మాత్రం మార్పు కనిపించడం లేదు. పిచ్‌ ఎలా ఉన్నా సీఎ్‌సకేలాంటి జట్టు మరీ 125 పరుగులు చేయడం వారి బ్యాటింగ్‌ ఎంత నాసిరకంగా సాగిందో తెలుస్తుంది. అయితే రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా 28 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయినా బట్లర్‌ ఈ పిచ్‌పై ఎలా బ్యాటింగ్‌ చేయాలో చూపించాడు. అతడికి కెప్టెన్‌ స్మిత్‌ తుదికంటా అండగా నిలవడంతో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్‌ అదరగొట్టింది. 


అబుదాబి: ఆడిన మ్యాచ్‌లు.. గెలుపు, ఓటములు సమానంగా ఉన్న చెన్నై-రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన పోరు ఏకపక్షంగా ముగిసింది. జోస్‌ బట్లర్‌ (48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 నాటౌట్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ కారణంగా రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో స్మిత్‌ సేన ఎనిమిది పాయింట్లతో ప్లేఆప్స్‌ రేసులో నిలిచింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 125 పరుగులు చేసింది. జడేజా (30 బంతుల్లో 4 ఫోర్లతో 35 నాటౌట్‌), ధోనీ (28 బంతుల్లో 2 ఫోర్లతో 28) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 126 పరుగులు చేసి గెలిచింది. స్టీవ్‌ స్మిత్‌ (26 నాటౌట్‌) సహకారం అందించాడు. చాహర్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా బట్లర్‌ నిలిచాడు.


ధోనీ సేన..ఇప్పుడెలా?

ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆ్‌ఫ్సకు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదేమో.. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న సీఎ్‌సకే ఖాతాలో కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. దీంతో ఈసారి నాకౌట్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అప్పుడు ప్లేఆ్‌ఫ్సకు కనీస అర్హతైన 14 పాయింట్లతో ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తమ 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ కేవలం 12 పాయింట్లు సాధించినా ప్లేఆ్‌ఫ్సకు చేరింది. అందుకే సీఎ్‌సకేకు సాంకేతికంగా ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోలేదనే చెప్పవచ్చు.


బట్లర్‌ అండతో..:


ఈ పిచ్‌పై కాస్త ఓపిక పడితే పరుగులు వచ్చే అవకాశమున్నప్పటికీ ఆరంభంలో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చెన్నైకన్నా దారుణంగా సాగింది. 28 పరుగులకే టాపార్డర్‌ వికెట్లన్నీ నేలకూలాయి. కానీ ఈ సంబురం ప్రత్యర్థికి ఎంతోసేపు లేకుండా బట్లర్‌, స్మిత్‌ అడ్డుగోడలా నిలిచారు. పవర్‌ప్లేలోపే చాహర్‌ తన వరుస ఓవర్లలో స్టోక్స్‌ (19), శాంసన్‌ (0)ను పెవిలియన్‌కు చేర్చగా, ఊతప్ప (4)ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేశాడు. ఈ స్థితిలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బట్లర్‌, స్మిత్‌ ఎలాంటి తొందరపాటు ప్రదర్శించలేదు. తక్కువ లక్ష్యమే కావడంతో ముందు వికెట్‌ కాపాడుకోవాలనే ఆలోచనతో బ్యాటింగ్‌ సాగించారు. స్మిత్‌ మరీ నిదానం కనబరిచినా బట్లర్‌ అడపాదడపా బౌండరీలతో లక్ష్యాన్ని కరిగించాడు. ముఖ్యంగా స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని చెలరేగాడు. 12వ ఓవర్‌లో 4,6తో 13 పరుగులు సాధించగా 15వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో 37 బంతుల్లోనే అర్ధసెంచరీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా చెన్నై బౌలర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకపోవడంతో 17.3 ఓవర్లలోనే మ్యాచ్‌ ముగిసింది.


పేలవంగా..: ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఆట చప్పగా సాగింది. స్లో పిచ్‌పై పరుగులు సాధించేందుకు తెగ కష్టపడ్డారు. కనీసం డెత్‌ ఓవర్లలో కూడా వీరు బ్యాట్లకు పనిచెప్పలేకపోయారు. ఆరంభం నుంచే రాజస్థాన్‌ బౌలర్లు ప్రత్యర్థిని అదుపులో ఉంచారు. మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ డుప్లెసి (10)ని ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. ఇక రాగానే రెండు ఫోర్లు బాదిన వాట్సన్‌ (8)ను మరుసటి ఓవర్‌లోనే త్యాగి పెవిలియన్‌కు చేర్చాడు. ఐదో ఓవర్‌లో రాయుడు (13) రెండు ఫోర్లు, సామ్‌ కర్రాన్‌ (22) ఓ సిక్స్‌ బాదడంతో 15 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో సీఎ్‌సకే 43 పరుగులు చేసింది. ఆ తర్వాత స్పిన్నర్లు తెవాటియా, గోపాల్‌ మరింత కట్టడి చేయడంతో పాటు వరుస ఓవర్లలో కర్రాన్‌, రాయుడును అవుట్‌ చేయడంతో చెన్నై 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో ధోనీ, జడేజా నిదానంగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డారు. వీరి ఆటతీరుకు మూడు ఓవర్ల పాటు ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. చివరికి 14వ ఓవర్‌లో జడేజా రెండు, ధోనీ ఓ ఫోర్‌ సాధించడంతో జట్టు స్కోరు కాస్త కదిలింది. నిదానంగా 17 ఓవర్లలో వంద పరుగులు పూర్తి చేసింది. ఈ సమయంలో అనవసరంగా రెండో పరుగు కోసం వెళ్లిన ధోనీ రనౌటయ్యాడు. వీరి మధ్య ఐదో వికెట్‌కు 51 పరుగులు వచ్చాయి. అటు జడేజా 18వ ఓవర్లలో రెండు ఫోర్లు బాదడంతో చెన్నైకి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఓవరాల్‌గా చివరి ఐదు ఓవర్లలో జట్టు అతికష్టంగా 36 పరుగులు సాధించింది.


ధోనీ సేన..ఇప్పుడెలా?

ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆ్‌ఫ్సకు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించలేదేమో.. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో పట్టికలో అట్టడుగున ఉన్న సీఎ్‌సకే ఖాతాలో కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. దీంతో ఈసారి నాకౌట్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అప్పుడు ప్లేఆ్‌ఫ్సకు కనీస అర్హతైన 14 పాయింట్లతో ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే తమ 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్‌ కూడా కీలకంగా మారుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ కేవలం 12 పాయింట్లు సాధించినా ప్లేఆ్‌ఫ్సకు చేరింది. అందుకే సీఎ్‌సకేకు సాంకేతికంగా ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోలేదనే చెప్పవచ్చు.


స్కోరు బోర్డు

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సామ్‌ కర్రాన్‌ (సి) బట్లర్‌ (బి) శ్రేయాస్‌ గోపాల్‌ 22, డుప్లెసి (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 10, వాట్సన్‌ (సి) తెవాటియా (బి) త్యాగి 8, రాయుడు (సి) శాంసన్‌ (బి) తెవాటియా 13, ధోనీ (రనౌట్‌) 28, జడేజా (నాటౌట్‌) 35, కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 125/5. వికెట్ల పతనం: 1-13, 2-26, 3-53, 4-56, 5-107. బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-20-1; రాజ్‌పుత్‌ 1-0-8-0; త్యాగి 4-0-35-1; స్టోక్స్‌ 3-0-27-0; శ్రేయాస్‌ గోపాల్‌ 4-0-14-1; తెవాటియా 4-0-18-1.


రాజస్థాన్‌ రాయల్స్‌: బెన్‌ స్టోక్స్‌ (బి) దీపక్‌ 19, ఊతప్ప (సి) ధోనీ (బి) హాజెల్‌వుడ్‌ 4, సంజు శాంసన్‌ (సి) ధోనీ (బి) దీపక్‌ 0, స్టీవ్‌ స్మిత్‌ (నాటౌట్‌) 26, జోస్‌ బట్లర్‌ (నాటౌట్‌) 70; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 17.3 ఓవర్లలో 126/3. వికెట్ల పతనం: 1-26, 2-28, 3-28. బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-18-2, హాజెల్‌వుడ్‌ 4-0-19-1, రవీంద్ర జడేజా 1.3-0-11-0, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-34-0, సామ్‌ కర్రాన్‌ 1-0-6-0, పియూష్‌ చావ్లా 3-0-32-0.



Updated Date - 2020-10-20T09:03:14+05:30 IST