చెన్నైకి పలు flight సర్వీసుల రద్దు

ABN , First Publish Date - 2021-11-10T23:51:57+05:30 IST

రుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు బుధ, గురువారాల్లో..

చెన్నైకి పలు flight సర్వీసుల రద్దు

చెన్నై: ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు బుధ, గురువారాల్లో ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో చెన్నైకి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చెన్నై విమానాశ్రయ ప్రతినిధి ఒకరు తెలిపారు. వాతావరణ ప్రతికూలత కారణంగా బుధవారం సాయంత్రానికి చెన్నై వచ్చే  ఏడు విమాన సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపింది.


రద్దయిన విమానాల్లో మధురై టు చెన్నై (7.30కి రావాల్సిన విమానం), షార్జా నుంచి చెన్నై వచ్చే ఎయిర్ అరేబియా విమానం (8.55), తిరుచ్చి నుంచి చెన్నై వచ్చే విమానం (10.30), ముంబై నుంచి చెన్నై (రాత్రి ఒంటిగంట)కు వచ్చే ఇండిగో విమానం, చెన్నై టు మదురై, చెన్నైటు ముంబై ఇండిగో ఫ్లైట్, చెన్నై టు తిరుచ్చి ఇండిగో ఫ్లయిట్ ఉన్నాయి.

Updated Date - 2021-11-10T23:51:57+05:30 IST