కరోనా టీకాలు విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు

ABN , First Publish Date - 2021-07-26T17:13:09+05:30 IST

దిండుగల్‌ జిల్లా వేడచెందూర్‌ సమీపంలో కరోనా టీకాలు అపహరించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు నుంచి 95 డోసుల టీకాలను స్వాధీనం

కరోనా టీకాలు విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు

96 డోసులు స్వాధీనం

చెన్నై/పెరంబూర్‌: దిండుగల్‌ జిల్లా వేడచెందూర్‌ సమీపంలో కరోనా టీకాలు అపహరించి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రభుత్వ నర్సు నుంచి 95 డోసుల టీకాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆమెను విచారిస్తున్నారు. చెన్నకోటకు చెందిన ధనలక్ష్మి కరూర్‌లో ఉన్న పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఆస్పత్రి నుంచి కరోనా టీకాలు అపహరించి మార్కెట్లో విక్రయి స్తున్నట్టు ఫిర్యాదులందాయి. దీంతో, ధనలక్ష్మి ఇంటిని ఏరియోడు తాలూకా వైద్యాధికారి పొన్‌ మహేశ్వరి నేతృత్వంలోని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేసి టీకా డోసులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-07-26T17:13:09+05:30 IST