ఓపీఎస్‌, ఈపీఎస్‌ సహా 250 మందిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-12T17:29:01+05:30 IST

ఓపీఎస్‌, ఈపీఎస్‌ సహా 250 మందిపై వ్యాధి నిరోధక చట్టం సహా ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాసనసభలో

ఓపీఎస్‌, ఈపీఎస్‌ సహా 250 మందిపై కేసు నమోదు

చెన్నై/పెరంబూర్‌: ఓపీఎస్‌, ఈపీఎస్‌ సహా 250 మందిపై వ్యాధి నిరోధక చట్టం సహా ఐదు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శాసనసభలో ప్రతిపక్ష నేతలను ఎంపిక చేసేందుకు స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం సోమవారం జరిగింది. రాష్ట్రంలో సోమవారం నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించారు. ఈ నేపథ్యంలో, సోమవారం ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించేం దుకు అనుమతించాలని కోరుతూ అన్నాడీఎంకే అందజేసిన వినతిపత్రం పరిశీలించిన పోలీసు శాఖ, సమావేశం నిర్వహణకు అనుమతించింది. సమావేశంలో పలు వాదోపవాదాల అనంతరం పార్టీ ఉపన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో, ఓపీఎస్‌, ఈపీఎస్‌ సహా 250 మంది రాయపేట పోలీసులు కేసు నమోదు చేశారు

Updated Date - 2021-05-12T17:29:01+05:30 IST