Abn logo
Jul 19 2021 @ 12:47PM

Chennai: తారాపురంలో యువకుడి హత్య

చెన్నై/ప్యారీస్‌: తిరుప్పూర్‌ జిల్లా తారాపురంలో యువకుడిని హత్య చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులు ప్రభుత్వాస్పత్రి ముందు రాస్తారోకో నిర్వహించడం ఆదివారం కలకలం రేపింది. తారాపురానికి చెందిన నాగరాజు కుమారుడు గోపీనాథ్‌ (21) ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంలో ఉబ్బారు డ్యాం సమీపంలో వున్న మడత్తుపాళయం వెపు వెళ్తుండగా, అతడిని అడ్డగించిన గుర్తు తెలి యని వ్యక్తులు.. వేటకోడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో గోపీనాఽథ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కన్నుమూశాడు. దీనిపై అందిన సమా చారంతో పోలీసులు అక్కడికి చేరుకుని గోపీనాథ్‌ శవాన్ని  తిరుప్పూర్‌ ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గోపీనాథ్‌ను హత మార్చిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ మృతుడి కుటుంబీకులు, గ్రామ స్తులు తారాపురం ఆస్పత్రి ముందు రాస్తారోకో నిర్వహించారు.  పోలీసులు జోక్యం చేసుకుని సముదాయించడంతో ఆందోళనకారులు శాంతించారు.