Metro రైళ్లలో 1.30 కోట్ల మంది ప్రయాణం

ABN , First Publish Date - 2021-12-03T19:25:39+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం చెన్నై మెట్రోరైళ్లలో 1.30 కోట్ల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. గత జూన్‌ 21వ తేది నుంచి మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి నవంబరు 30

Metro రైళ్లలో 1.30 కోట్ల మంది ప్రయాణం

చెన్నై: కరోనా లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం చెన్నై మెట్రోరైళ్లలో 1.30 కోట్ల మంది ప్రయాణించినట్టు అధికారులు తెలిపారు. గత జూన్‌ 21వ తేది నుంచి మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి నవంబరు 30వ తేదీ వరకు 1,30,55,833 మంది ప్రయాణించారని, గరిష్టంగా నవంబరు 25వ తేది 1.31 లక్షల మంది ప్రయాణించారని అధికారులు పేర్కొన్నారు. మెట్రోలో నవంబరులో మొబైల్‌ ఫోన్‌లో క్యూ ఆర్‌ కోడ్‌ వినియోగించి 45,609 మంది, ట్రావెల్‌ కార్డు సౌకర్యంతో 16.16 లక్షల మంది ప్రయాణించారని, క్యూ ఆర్‌ కోడ్‌, ట్రావెల్‌ కార్డులతో ప్రయాణించే వారు 20 శాతం రాయితీ పొందారని వారు వివరించారు.

Updated Date - 2021-12-03T19:25:39+05:30 IST