ప్రభుత్వ స్థలాల్లో నేతల విగ్రహాలొద్దు

ABN , First Publish Date - 2021-10-28T14:43:57+05:30 IST

భవిష్యత్తులో అనుమతి లేకుండా నేతల విగ్రహాల ఏర్పాటును అడ్డుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లోకనాథన్‌ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, కోయంబత్తూర్‌ అవినా

ప్రభుత్వ స్థలాల్లో నేతల విగ్రహాలొద్దు

                 - మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు


పెరంబూర్‌(Chennai): భవిష్యత్తులో అనుమతి లేకుండా నేతల విగ్రహాల ఏర్పాటును అడ్డుకొనేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లోకనాథన్‌ అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో, కోయంబత్తూర్‌ అవినాశి రోడ్డు జంక్షన్‌లో అనుమతులతో ఏర్పాటు చేసిన అన్నా విగ్రహపీఠం విస్తరించి, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలు ఏర్పాటు చేశారన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఈ రెండు విగ్రహాలు తొలగించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్‌ బెనర్జీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన ధర్మాసనం విచా రించింది. నేతలు అభిమానించే కార్యకర్తలు, వారికి అగౌరవం చేకూరేలా ఎలాంటి చర్యలు చేపట్టరాదన్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే విగ్రహాలు తొలగించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్రప్రభుత్వం అమలు చేయాలన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలు, ప్రభుత్వ నిర్ణయం తో కూడిన బదులు పిటిషన్‌ దాఖలుచేయాలని ప్రభుత్వ కార్యదర్శికి ఉత్తర్వులు జారీచేసిన ధర్మాసనం, తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది.


Updated Date - 2021-10-28T14:43:57+05:30 IST