CCTV cameras, GPS: మహానగరానికి మరో 242 కొత్త బస్సులు

ABN , First Publish Date - 2022-08-20T14:19:48+05:30 IST

చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) కొత్తగా 242 బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్లు జారీ చేసింది. మహానగర రవాణా

CCTV cameras, GPS: మహానగరానికి మరో 242 కొత్త బస్సులు

- కొనుగోలుకు ఎంటీసీ సన్నాహాలు

- సీసీ టీవీ కెమెరాలు, జీపీఎస్‌, డిజిటల్‌ బోర్డు ఉండేలా ఏర్పాట్లు


చెన్నై, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): చెన్నై మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) కొత్తగా 242 బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్లు జారీ చేసింది. మహానగర రవాణా సంస్థ రోజుకు 3454 బస్సులను నడుపుతోంది. వీటిలో రోజూ 30 లక్షలమంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 10.5 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతమున్న 3454 సిటీ బస్సుల్లో కాలపరిమితి ముగిసిన బస్సులు 1000 వరకూ ఉన్నాయి. ఈ పాత బస్సులకు బదులుగా కొత్త బస్సులను నడపాలని మహానగర రవాణా సంస్థ(Metropolitan Transport Corporation) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జర్మన్‌ ఫైనాన్స్‌ సంస్థ ఆర్థికసాయంతో 644 బస్సులను కొనుగోలు చేయనున్నారు. తొలి విడతగా 242 బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు, జీపీఎస్‌ పరికరాలు, గమ్యస్థానాలను తెలిపే డిజిటల్‌ బోర్డు(Digital board) తదితర నవీన సాంకేతిక సదుపాయాలు కలిగి ఉంటాయని వివరించారు. అంతే కాకుండా అదనంగా మూడు అత్యవసర ప్రవేశ ద్వారాలు కూడా ఉంటాయన్నారు. నెలలోగా టెండర్లు ఖరారైన వెంటనే కొత్త బస్సులను కొనుగులు చేసి, కాలపరిమితి దాటిన బస్సులను తొలగించనున్నామని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-08-20T14:19:48+05:30 IST