Chennai కార్పొరేషన్‌ పునర్విభజన

ABN , First Publish Date - 2022-05-08T15:11:39+05:30 IST

గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పునర్విభజన కానుంది. ఆ ప్రకారం 22 శాసససభ శాసనభ నియోజకవర్గాల పరిధిలో 23 మండలాలు (జోన్‌లు) ఏర్పాటుకానున్నాయి. చెన్నై కార్పొరేషన్‌లో

Chennai కార్పొరేషన్‌ పునర్విభజన

                                     - 23 మండలాలకు పెంపు


పెరంబూర్‌(చెన్నై): గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) పునర్విభజన కానుంది. ఆ ప్రకారం 22 శాసససభ శాసనభ నియోజకవర్గాల పరిధిలో 23  మండలాలు (జోన్‌లు) ఏర్పాటుకానున్నాయి. చెన్నై కార్పొరేషన్‌లో 2011లో 155 వార్డులు, 10 మండలాలు ఉండేవి. ఆ తర్వాత కార్పొరేషన్‌లో వార్డుల సంఖ్యను 200లకు పెంచారు. తిరువళ్లూర్‌, కాంచీపురం మున్సిపాలిటీల్లో కొన్ని ప్రాంతాలను చెన్నై కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో మండలాల సంఖ్యను 10 నుంచి 15కు పెంచారు. చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో 22 శాసనసభ నియోజకవర్గాలుండగా, వాటిలో 16 నియోజకవర్గాలు చెన్నై జిల్లాల్లో ఉండగా, మిగిలినవి చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నై కార్పొరేషన్‌లోని శాసనసభ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకొని మండలాల సంఖ్య పెంచనున్నట్లు శాసససభ సమావేశాల్లో మంత్రి కేఎన్‌ నెహ్రూ ప్రకటించారు. ఆ ప్రకారం కార్పొరేషన్‌ను 23 మండలాలుగా పునర్విభజన చేయనున్నారు. 22 శాసనసభ నియోజకవర్గాలకుగాను 23 మండలాలు ఏర్పాటవుతాయి. అందుకోసం వార్డుల విభజన ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. కొత్త మండలాలు, వాటిలో కలవనున్న వార్డుల వివరాలతో కూడిన ప్రతిపాదన జాబితా విడుదలైంది. ఆ ప్రకారం మొదటి మండలంలో 18 వార్డులు, రెండవ మండలంలో 15 వార్డులు, మూడవ మండలంలో 7, నాలుగవ మండలంలో 7, 5వ మండలంలో 7, 6వ మండలంలో 6, 7వ మండలంలో 6, 8వ మండలంలో 6, 9వ మండలంలో 6, 10వ మండలంలో 13, 11వ మండలంలో 7, 12వ మండలంలో 6, 13వ మండలంలో 7, 14వ మండలంలో 7, 25వ మండలంలో 7, 16వ మండలంలో 6, 17వ మండలంలో 15, 18వ మండలంలో 12, 19వ మండలంలో 7, 20వ మండలంలో 7, 21వ మండలంలో 8, 22వ మండలంలో 11, 23వ మండలంలో 9 వార్డులు ఏర్పాటుచేసే ప్రతిపాదన సిద్ధమైంది.

Read more