Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 20 Jan 2022 11:35:22 IST

యువ దర్శకుడి కిడ్నాప్ డ్రామా.. 30 లక్షలు కావాలంటూ సొంత ఫ్యామిలీకే బెదిరింపులు

twitter-iconwatsapp-iconfb-icon
యువ దర్శకుడి కిడ్నాప్ డ్రామా.. 30 లక్షలు కావాలంటూ సొంత ఫ్యామిలీకే బెదిరింపులు

యువతలో చాలామందికి చాలా కలలు ఉంటాయి. వాటిని సాధించే క్రమంలో ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు కూడా. అయితే కొందరూ మాత్రం దొడ్డిదారిన వాటిని సాధించాలని చూస్తూ ఇబ్బందుల పాలవుతుంటారు. చెన్నైకి చెందిన 24 ఏళ్ల ఔత్సాహిక దర్శకుడి విషయంలో అలాగే జరిగింది.


ఆ యువకుడికి ఓ షార్ట్ ఫిల్మ్ కోసం 30 లక్షలు కావాల్సి వచ్చాయి. దీంతో తండ్రిని వెళ్లి అడిగాడు కానీ దానికి ఆయన నిరాకరించి 5 లక్షలు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఇద్దరూ స్నేహితులతో కలిసి తనను తానే కిడ్నాప్ డ్రామా అయినట్లు డ్రామా ఆడాడు. వారందరూ కలిసి అతని తండ్రి పెన్సిలయ్యకి ఫోన్ చేసి నగదు డిమాండ్ చేశారు. అది కూడా తెలంగాణకి తీసుకురావాలని, పోలీసులకి చెబితే చంపేస్తామని బెదిరింపులకి పాల్పడ్డారు.

 

అయితే పెన్సిలయ్య చెన్నై పోలీసులకి కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని కనిపెట్టేశారు. ఆ యువకుడు, తన స్నేహితులతో కలిసి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నారు. అయితే విచారణలో వారందరూ తమ నేరాన్ని ఒప్పుకున్నారని, తమ షార్ట్ ఫిల్మ్ కోసమే వారు ఈ డ్రామా అడినట్లు చెప్పారని ఓ పోలీసు అధికారి చెప్పారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement