Chennai ఎయిర్‌పోర్టులో తొలగించిన ఆంక్షలు

ABN , First Publish Date - 2022-02-15T14:23:51+05:30 IST

రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్‌ నిబంధ నలను సోమవారం నుంచి పూర్తిగా తొలగించారు. గతంలా పూర్తి సడలింపులతో విదేశీ ప్రయాణికులకు అనుమతిస్తున్న

Chennai ఎయిర్‌పోర్టులో తొలగించిన ఆంక్షలు

                            - పరీక్షలు, ఐసోలేషన్‌ రద్దు


చెన్నై: రాష్ట్రంలో కరోనా, ఒమైక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్‌ నిబంధ నలను సోమవారం నుంచి పూర్తిగా తొలగించారు. గతంలా పూర్తి సడలింపులతో విదేశీ ప్రయాణికులకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై కొవిడ్‌ టెస్టులు, ఐసోలేషన్‌లు ఉండవని, థర్మల్‌ స్కాన్‌ మాత్రమే నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశం మేరకు విదేశీ ప్రయాణికులకు కరోనా ముందస్తు వైద్యపరీక్షలను రద్దు చేశారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నట్టు ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్లం చేశారు. ప్రస్తుతానికి విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు ధ్రువపత్రాలుఉంటే చాలన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో కొవిడ్‌ నిబంధనలను పూర్తి స్థాయిలో తొలగించటం పట్ల విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా హర్షం ప్రకటించారు. గంటల తరబడి వైద్య పరీక్షల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పినందుకు సంతోష పడుతున్నామని తెలిపారు. సోమవారం విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా సాధారణ కస్టమ్స్‌ తనిఖీ తర్వాత సులువుగా బయటకు వచ్చి సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. 

Updated Date - 2022-02-15T14:23:51+05:30 IST