విమానాశ్రయంలో 2.76 కిలోల బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-02-12T16:13:11+05:30 IST

దుబాయ్‌, శ్రీలంక నుంచి శుక్రవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి వచ్చిన రెండు విమానాల్లో అక్రమంగా తరలిస్తున్న 2.75 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అరెస్టు చేశా

విమానాశ్రయంలో 2.76 కిలోల బంగారం పట్టివేత

                              - ఇద్దరి అరెస్టు


ప్యారీస్‌(చెన్నై): దుబాయ్‌, శ్రీలంక నుంచి శుక్రవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయానికి వచ్చిన రెండు విమానాల్లో అక్రమంగా తరలిస్తున్న 2.75 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. దీనిపై కస్టమ్స్‌ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో, దుబాయ్‌ విమానంలోని ప్రయాణికుల్లో నగరానికి చెందిన జమీన్‌కమల్‌(35) అనే వ్యక్తి సూట్‌కేస్‌ అరల్లో దాచిన 1.53 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే శ్రీలంక నుంచి వచ్చిన మరో విమానంలోని అబుదాగీర్‌(39) నుంచి 1.23 కిలోల బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఇరువురి అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-02-12T16:13:11+05:30 IST