Abn logo
May 17 2021 @ 08:29AM

దుబాయ్ నుంచి చెన్నైకు బంగారం అక్రమ రవాణ

  2 కిలోల బంగారంతో వచ్చిన ప్రయాణికుడి అరెస్ట్ 

చెన్నై : దుబాయ్ నుంచి చెన్నైకు బంగారం అక్రమ రవాణ గుట్టును కస్టమ్స్ అధికారులు రట్టు చేశారు. దుబాయ్ నుంచి ఓ ప్రయాణికుడు 2.07 కిలోల గోల్డ్ పేస్ట్ ను శరీరానికి కట్టుకొని చెన్నైలోని విమానాశ్రయంలో దిగారు. ఎమిరేట్స్ విమానం ఈకే 544 లో దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చి గ్రీన్ ఛానల్ వద్ద ఆత్రుతగా నిష్ర్కమిస్తుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. ప్రయాణికుడిని పట్టుకొని తనిఖీలు చేయగా గాజుగుడ్డలో 2 కిలోల బంగారం పేస్టును శరీరానికి కట్టుకొని తరలిస్తున్నట్లు వెల్లడైంది. 

ఈ బంగారం విలువ రూ.89.17 లక్షలని అధికారులు చెప్పారు. దుబాయ్ నుంచి బంగారం అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి పేరు మహ్మద్ అష్రాఫ్ (21)గా గుర్తించారు. అష్రాఫ్ ను ప్రశ్నించగా చెన్నై విమానాశ్రయం బయట ఉన్న వ్యక్తికి బంగారం ప్యాకెట్లు అందజేయాలని సూచించారు.దీంతో కస్టమ్స్ అధికారులు చెన్నైకు చెందిన ముహమ్మద్ ఇబ్రహీం(39) బంగారం రిసీవర్ అని గుర్తించారు. ఇద్దరిని అరెస్టు చేశామని బంగారం అక్రమ రవాణపై దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు వివరించారు.


Advertisement