Abn logo
May 14 2021 @ 10:21AM

హద్దుమీరితే...

చెన్నై/అడయార్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో చెన్నై (జిల్లా) మొదటిస్థానంలో వుంది. ఈ ఒక్క జిల్లాలోనే రోజుకు ఏడు వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు వుతున్నాయి. అందువల్ల ఇక్కడ పటిష్ఠంగా ఆంక్షలు అమలవుతు న్నాయి. లాక్డౌన్‌ వేళ ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బందు లు పడకుండా ఉండేందుకు వీలుగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఈ సమయంలో రోడ్లపైకి వచ్చేవారిపై చర్యలు తీసుకోరాదని పోలీసులకు ప్రభుత్వంతో పాటు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో లాక్డౌన్‌ సడలింపు వేళలో రోడ్లపై కనిపించే వారి జోలికి పోలీసులు వెళ్ళడం లేదు.


అందువల్ల రోడపై చక్కర్లు కొట్టే వారి సంఖ్య కూడా పెరిగింది. అప్పటికీ పోలీసులు పెద్దగా చర్యలు తీసుకోలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న కొందరు రోడపై ఇస్టానుసారంగా తిరుగుతున్నారు. ఇలాంటి వారిని పోలీసులు పట్టుకుని బెండు తీస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు నిర్బంధ లాక్డౌన్‌ వేళలో బయట సంచరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసుల హెచ్చరికలు పెడ చెవినపెట్టే వారికి మాత్రం లాఠీ దెబ్బను రుచి చూపిస్తున్నారు. అంతేకాకుండా, అపరాధంతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుం టున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారులైన అన్నాసాలై, బీచ్‌ రోడ్డు, జవహర్‌లాల్‌ నెహ్రూ రోడ్డు, పూందమల్లి హైరోడ్డు, న్యూ ఆవడి రోడ్డు వంటి మరికొన్ని రహదారుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల వద్ద కొంతమంది పోలీసులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తూ, వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అత్యవసర పనులమీద వెళ్ళేవారిని మాత్రం వదిలివేస్తూ, అనవసరంగా రోడ్లపై చక్కర్లు కొట్టే వారిని మాత్రం గట్టిగా మందలించి వెనక్కి పంపుతున్నారు. ఇలా ఒకటికి రెండు సార్లు పట్టుబడితే మాత్రం అలాంటి వాహనాలను సీజ్‌ చేయడమే కాకుండా, భారీగా అపరాధం విధిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement