చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి

ABN , First Publish Date - 2022-08-08T05:36:42+05:30 IST

దేశంలో వ్యవసాయరంగం తరువాత అతిపెద్దది చేనేత రంగమని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రశాంతి

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి


భీమవరం టౌన్‌, ఆగస్టు 7 : దేశంలో వ్యవసాయరంగం తరువాత అతిపెద్దది చేనేత రంగమని అటువంటి రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో 8వ చేనేత దినోత్సవం సందర్భంగా భీమవరం మునిసిపల్‌ సమావేశ మందిరంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లు ఉన్నాయని, మన జిల్లాలో పాలకొల్లు చేనేతకు మరింత విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. చేనేతరంగం స్వాతంత్య్ర సమరంలో కూడా అనుసంధానంతో ఉందని ‘మన చేనేత వస్త్రం–మన జాతీయ పతాకం’లో చోటు సంపాదిం చుకుందన్నారు.  మన దేశానికి వచ్చిన విదేశీయులు మన చేనేత వస్త్రాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తారన్నారు. చేతన అనేది ఒక వస్త్రం కాదని ఒక తరం నుంచి మరోతరానికి అనుసంధానం చేసే గొప్ప కార్యక్రమం అన్నారు. చేనేత రంగంలో టెక్నాలజీ ఉపయోగించి వాల్యూఎడిషన్‌ పెంచాలని, నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేసి సరస మైన ధరలకు అందించాలని సూచించారు. నేతన్నలను ఆదుకు నేందుకు ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసి కార్మికులకు కొంతమేలు జరిగిందని భావిస్తున్నట్టు తెలిపారు. రోబోయే రోజుల్లో చేనేత ఉత్పత్తులు మరింత పెరిగే విధంగా బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇన్‌చార్జి జేసీ కె.కృష్ణవేణి మాట్లాడుతూ చేనేత వస్త్రాలను విదేశాలకు ఎగుమతిచేసి మరింత విదేశీమారక ద్రవ్యాన్ని సంపాదించడంతో పాటు ప్రపంచఖ్యాతిని సాధించాలన్నారు. అనంతరం ప్రకాశంచౌక్‌ నుంచి మునిసిపల్‌ కార్యాలయం వరకు కార్మికులతో చేనేత ర్యాలీ ఘనంగా నిర్వహించారు.  భీమవరం ఆర్డీవో దాసి రాజు, కమిషనర్‌ ఎస్‌. శివరామకృష్ణ, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు కె.అప్పారావు, తహసీల్దార్‌ వై.రవికుమార్‌, విజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, తదితరులు ఉన్నారు.



Updated Date - 2022-08-08T05:36:42+05:30 IST