చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించండి

ABN , First Publish Date - 2022-08-08T06:13:23+05:30 IST

మహి ళలకు చీరలంటే అమితమైన ఇష్టం.. ఏ షాపుకైనా వెళ్లిన ప్పుడు నచ్చిన చీర కనిపించిందా వెంటనే ఒకసారి భుజంపై వేసుకుని చూసుకోవాల్సిందే.

చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించండి
చేనేత దినోత్సవంలో కలెక్టర్‌ మాధవీలత

చేనేత దినోత్సవంలో కలెక్టర్‌ మాధవీలత



ప్రకాష్‌నగర్‌ ( రాజమహేంద్రవరం) ఆగస్టు 7 : మహి ళలకు చీరలంటే అమితమైన ఇష్టం.. ఏ షాపుకైనా వెళ్లిన ప్పుడు నచ్చిన చీర కనిపించిందా వెంటనే ఒకసారి భుజంపై వేసుకుని చూసుకోవాల్సిందే. ఈ చిత్రంలో చూస్తున్నారుగా.. ఎవరో గుర్తుపట్టారా.. మన జిల్లా కలెక్టర్‌ మాధవీలత..     జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నేత బజా రులో ఏర్పాటుచేసిన ఆప్కో వస్త్ర ప్రదర్శన అమ్మకాల స్టాల్స్‌ ను ఆదివారం జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ప్రారంభించి మాట్లాడారు. 1905వ సంవత్సరంలో నిర్వహించిన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా 2015 వ సంవత్సరం నుంచి ప్రతిఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్పవాన్ని జరుపుకుం టున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు డిమాండ్‌ ఎక్కువగా వుందని, నేత కార్మికులు ఇంటర్నెట్‌ సహాయంతో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ తమ ఉత్ప త్తుల అమ్మకాలను పెంచుకోవాలన్నారు.ఇప్పటికే ఆప్కో సంస్థ అమెజాన్‌తో ఒప్పందం చేసుకుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాలో మురమండ, పుల గుర్త క్లస్టర్ల ఏర్పాటుకై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అనంతరం కాసేపు ఇలా చీరలు చూసుకుని ముచ్చట పడ్డారు.ఆప్కో డివిజనల్‌ మార్కెటింగ్‌ అధికారి ఎల్‌.రామ కృష్ణ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ వరకు ప్రదర్శన ఉం టుందన్నారు.ఐదుగురు చేనేత కార్మికులను కలెక్టర్‌   సన్మా నించారు.కార్యక్రమంలో చేనేత అభివృద్ధి అధికారులు కృష్ణభాస్కర్‌, కె.నాయుడు, గణేష్‌, సహాయ అభివృద్ధి అధికారి సత్యవేణి, సీనియర్‌ మేనేజర్‌ విజ యభాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T06:13:23+05:30 IST