రాపూరులో వినతులు స్వీకరిస్తున్న నెల్లూరు ఆర్డీవో
రాపూరు, మే 25: చుక్కల భూముల పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని నెల్లూరు ఆర్డీవో కొండయ్య తెలిపారు. రాపూరు రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అలసత్యం వల్లే స్పందనలో వినతులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూకు సం బంధించి ఎలాంటి దరఖాస్తు వచ్చినా వాటిని పరిశీలించి అవసరమైన డాక్యుమెంట్లను ఇవ్వాలని కోరాలన్నారు. డాక్యుమెంటు లేనివాటికి స్వయంగా వెళ్లి విచారించి పరిష్కారం చేయాలన్నారు. రెవెన్యూ సమస్యల విషయంలో ఎలాంటి అలసత్వం వహించినా కఠిన చర్యలు తప్పవన్నారు. చుక్కల భూముల సమస్యలను జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవోను తహసీల్దారు పద్మావతి, రెవెన్యూ సిబ్బంది ఘనంగా సన్మానించారు. పలువురు రైతులు ఆర్డీవోకు వినతులు అందించారు.